Skip to content

The Pomegranate Tree గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. వారు ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో పాటు, పేనిన సన్నని నారతో దానిమ్మపండ్లు తయారుచేశారు.

  2. స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన గంటలను వస్త్రం అంచు చుట్టూ ఉన్న దానిమ్మపండ్ల మధ్య తగిలించారు.

  3. సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.

  4. వారు ఎష్కోలు లోయకు చేరుకున్నప్పుడు ఒకే గెల ఉన్న ద్రాక్షచెట్టు కొమ్మను నరికారు. దానిని ఇద్దరు వారి మధ్య కర్ర మీద మోసారు, దానితో పాటు కొన్ని దానిమ్మలు, అంజూరాలు కూడా తీసుకున్నారు.

  5. మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!”

  6. అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;

  7. సౌలు గిబియా పొలిమేరల్లో మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద ఉన్నాడు, అతనితో పాటు సుమారు ఆరువందలమంది ఉన్నారు.

  8. ఆ స్తంభాలను మీది పీటలను అలంకరించడానికి చుట్టూ రెండు వరుసల దానిమ్మపండ్లు చేశాడు.

  9. నీ పెదవులు ఎర్ర త్రాడులా ఉన్నాయి; నీ నోరు మనోహరము. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, సగం దానిమ్మ పండులా ఉన్నాయి.

  10. నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,

  11. నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.

  12. లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.

  13. ప్రొద్దున్నే లేచి, ద్రాక్ష తోటలకు వెళ్లిపోదాం ద్రాక్షవల్లులు చిగిర్చాయేమో, పూలు పూచాయేమో, దానిమ్మ చెట్లు పూతకు వచ్చాయేయో, చూద్దాము రా! అక్కడ నా ప్రేమ నీకు వ్యక్తం చేస్తాను.

  14. నేను నిన్ను తోలుకొని నాకు ఉపదేశం చేసిన, నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని. నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని, దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.

  15. ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.

  16. గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”