Skip to content

The Lot గురించి బైబిల్ వచనాలు

34 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక.

  2. అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి.

  3. విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.

  4. సమూయేలు ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిని సమకూర్చినప్పుడు చీటిలో బెన్యామీను గోత్రం ఎంపిక చేయబడింది.

  5. బెన్యామీను గోత్రం వారిని వారి కుటుంబాల ప్రకారం సమకూర్చినప్పుడు చీటిలో మత్రీ కుటుంబం ఎంపిక చేయబడింది. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఎంపిక చేయబడ్డాడు. అయితే వారు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడలేదు.

  6. ఎలియాజరు వారసులలో, ఈతామారు వారసులలో పరిశుద్ధాలయ అధికారులుగా, దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి, పక్షపాతం లేకుండా చీట్లు వేసి వారిని విభాగించారు.

  7. లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.

  8. మొదటి చీటి యెహోయారీబుకు, రెండవది యెదాయాకు,

  9. మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,

  10. అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

  11. ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,

  12. తొమ్మిదవది యెషూవకు, పదవది షెకన్యాకు,

  13. పదకొండవది ఎల్యాషీబుకు, పన్నెండవది యాకీముకు,

  14. పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,

  15. పదిహేనవది బిల్గాకు, పదహారవది ఇమ్మేరుకు,

  16. పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,

  17. పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,

  18. ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,

  19. ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.

  20. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.

  21. లేవీ వారసులలో మిగిలినవారు: అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు; షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.

  22. రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.

  23. ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు; షెలోమోతు కుమారుల నుండి: యహతు.

  24. హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

  25. ఉజ్జీయేలు కుమారుడు: మీకా; మీకా కుమారుల నుండి: షామీరు.