కంటెంట్‌కు వెళ్లండి

The Lot గురించి బైబిల్ వచనాలు

34 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీకా సోదరుడు: ఇష్షీయా; ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.

  2. మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.

  3. మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.

  4. మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.

  5. కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.

  6. మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు.

  7. వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.

  8. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన వస్త్రాలను తీసుకుని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే వస్త్రంగా నేయబడింది.

  9. కాబట్టి వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం” అని చెప్పుకొన్నారు. లేఖనంలో వ్రాయబడినట్లు, “వారు నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు” అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.