కంటెంట్‌కు వెళ్లండి

The Levites గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.

  2. మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’

  3. “లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి.

  4. మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము.

  5. మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ”

  6. “ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి.

  7. అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి.

  8. “లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల దూరంలో ఉంటుంది.

  9. పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు.

  10. “లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి.

  11. మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి.

  12. ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.”

  13. లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.

  14. అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ, ‘నేను వారిని చూడలేదు’ అతడు తన సోదరులను గుర్తించలేదు తన సొంత పిల్లలను అంగీకరించలేదు. కాని అతడు నీ మాట గమనించాడు నీ నిబంధనను కాపాడాడు.

  15. అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.

  16. యెహోవా, అతని సేవను దీవించండి, అతని చేతి పనులను బట్టి సంతోషించండి. అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి, అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”

  17. అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు, “మీరు చేయాల్సింది ఇదే: సబ్బాతు దినాన విధులకు వెళ్లే వారిలో మూడవ వంతు వచ్చి రాజభవనాన్ని కాపలా కాయాలి.

  18. ఇంకొక మూడవ భాగం సూరు ద్వారం దగ్గర, మరో మూడవ భాగం కాపలాకు వెనుక ఉన్న ద్వారం దగ్గర ఉండాలి.

  19. మీలో సబ్బాతు దినాన్న పనిలో లేనివారు యెహోవా మందిరాన్ని, రాజును కాపలా కాయాలి.

  20. మీలో ప్రతి ఒక్కరూ ఆయుధాలు చేతపట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. ఎవరైనా మీ వరుసలోకి వస్తే వారిని చంపేయాలి. రాజు ఎక్కడికి వెళ్లినా అతనికి దగ్గరగా ఉండాలి.”

  21. యాజకుడైన యెహోయాదా ఆదేశించినట్లే ఆ శతాధిపతులు చేశారు. ప్రతి ఒక్కరు సబ్బాతు దినం విధులకు వెళ్లేవారిని, సబ్బాతు దినం విధులకు వెళ్లని వారితో పాటు యాజకుడైన యెహోయాదా దగ్గరకు తీసుకువచ్చారు.

  22. లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.

  23. గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.

  24. కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

  25. మెరారి కుమారులు: మహలి, మూషి.