Skip to content

The Levites గురించి బైబిల్ వచనాలు

255 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు హషబ్యా కుమారుడు, అతడు అమజ్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,

  2. అతడు అమ్జీ కుమారుడు, అతడు బానీ కుమారుడు, అతడు షమెరు కుమారుడు,

  3. అతడు మహలి కుమారుడు, అతడు మూషి కుమారుడు, అతడు మెరారి కుమారుడు, అతడు లేవీ కుమారుడు.

  4. వారి తోటి లేవీయులు దేవుని మందిరమనే ప్రత్యక్షగుడారంలో జరగాల్సిన ఇతర పనులన్నిటి కోసం నియమించబడ్డారు.

  5. ద్వారపాలకులు: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వారి తోటి లేవీయులు. వీరిలో షల్లూము పెద్ద.

  6. వారు తూర్పున ఉన్న రాజు ద్వారం దగ్గర ఇప్పటివరకు సేవ చేస్తున్నారు. వీరందరు లేవీయుల సమూహానికి చెందిన ద్వారపాలకులు.

  7. కోరహు కుమారుడైన ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూము, తన కోరహీయుల వంశంలోని తన తోటి ద్వారపాలకులు, తమ పూర్వికులు యెహోవా శిబిరానికి కావలివారిగా ఉన్నట్లుగా, వారు ఆలయద్వారాన్ని కాపలా కాసేవారు.

  8. పూర్వకాలంలో ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నారు.

  9. మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమావేశ గుడారపు ద్వారానికి ద్వారపాలకుడు.

  10. ద్వారాల దగ్గర ద్వారపాలకులుగా ఎన్నుకోబడినవారు 212 మంది. వారు తమ గ్రామాల్లో తమ వంశాల ప్రకారం నమోదు చేయబడ్డారు. వారు నమ్మకమైన వారని దావీదు, దీర్ఘదర్శియైన సమూయేలు వారిని ఆ స్థానాల్లో నియమించారు.

  11. వారు వారి వారసులు సమావేశపు గుడారం అని పిలువబడే యెహోవా మందిరపు ద్వారాలకు కాపలా కాసే బాధ్యత కలిగి ఉన్నారు.

  12. ద్వారపాలకులు నలువైపులా ఉన్నారు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఉన్నారు.

  13. వారి గ్రామాల్లో ఉండే వారి తోటి లేవీయులు క్రమంగా వస్తూ ఏడు రోజులపాటు తమ విధులను పంచుకునేవారు.

  14. అయితే లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు నమ్మకమైనవారు కాబట్టి దేవుని మందిరపు గదులకు, ఖజానాకు సంబంధించిన బాధ్యత వారికి ఇవ్వబడింది.

  15. అప్పుడు అహరోను వారసులను, లేవీయులను పిలిపించాడు, వారు వీరే:

  16. కహాతు వారసులలో నుండి, వారి నాయకుడైన ఊరియేలు, అతని బంధువుల్లో 120 మంది;

  17. మెరారి వారసులలో నుండి వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో 220 మంది;

  18. గెర్షోను వారసులలో నుండి వారి నాయకుడైన యోవేలు, అతని బంధువుల్లో 130 మంది;

  19. ఎలీషాపాను వారసులలో నుండి వారి నాయకుడైన షెమయా, అతని బంధువుల్లో 200 మంది;

  20. హెబ్రోను వారసులలో నుండి వారి నాయకుడైన ఎలీయేలు, అతని బంధువుల్లో 80 మంది;

  21. ఉజ్జీయేలు వారసులలో నుండి వారి నాయకుడైన అమ్మీనాదాబు, అతని బంధువుల్లో 112 మంది.

  22. అతడు ఇశ్రాయేలు నాయకులందరిని, యాజకులను, లేవీయులను సమకూర్చాడు.

  23. ముప్పై సంవత్సరాలు అంతకు పైవయస్సు లేవీయులు లెక్కించబడ్డారు. వారు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది మనుష్యులు.

  24. దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి.

  25. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.