Skip to content

The Atonement గురించి బైబిల్ వచనాలు: Foretold

12 వచనాలు · 28 కోణాలు

Foretold గురించి వచనాలు

  1. ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు. మన రోగాలను భరించారు; అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.

  2. అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు. మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది. అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.

  3. మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము. మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు. యెహోవా మనందరి దోషాన్ని అతని మీద మోపారు.

  4. అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు. అయినా అతని తరంలో నిరసన తెలిపింది ఎవరు? సజీవుల భూమి మీద నుండి అతడు తీసివేయబడ్డాడు; అతడు నా ప్రజల పాపాల కోసం శిక్షించబడ్డాడు.

  5. అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటిలో ఏ మోసం లేదు కాని అతడు చనిపోయినప్పుడు దుర్మార్గులతో సమాధి చేశారు, ధనవంతుల సమాధిలో అతన్ని ఉంచారు.

  6. అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది.

  7. అతడు శ్రమ పొందిన తర్వాత జీవిత వెలుగును చూసి తృప్తి చెందుతాడు; నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు, వారి దోషాలను అతడు భరిస్తాడు.

  8. కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.

  9. “దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.

  10. “దీనిని తెలుసుకొని, గ్రహించు: యెరూషలేము పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం ఆజ్ఞ ఇయ్యబడింది మొదలుకొని, అభిషిక్తుడైన అధిపతి వచ్చేవరకు ఏడు ‘వారాలు,’ అరవై రెండు ‘వారాలు’ పడుతుంది. అయితే కష్టకాలంలో యెరూషలేము నడి వీధులతో, కాలువతో పునర్నిర్మించబడుతుంది.

  11. అరవై రెండు ‘సంవత్సరాల’ తర్వాత అభిషిక్తుడు హతం చేయబడతాడు, ఆయన స్వాధీనంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చే పరిపాలకుని ప్రజలు పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనం చేస్తారు. అంతం వరదలా వస్తుంది: యుద్ధం అంతం వరకు కొనసాగుతుంది, వినాశనం జరగాలని నిర్ణయంచబడింది.

  12. ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”