Skip to content

The Affections గురించి బైబిల్ వచనాలు

59 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.

  2. పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి:

  3. భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”

  4. యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.

  5. యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.

  6. అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి.

  7. యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.

  8. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.

  9. సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.

  10. మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.

  11. పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.

  12. సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!

  13. యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.

  14. “అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” అని యెహోవా అంటున్నారు; అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.

  15. ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.

  16. దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.

  17. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.

  18. అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.

  19. ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.

  20. మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి!

  21. నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది.

  22. నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను.

  23. “గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.

  24. ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు; తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా నీతిని అనుసరించే దేశంగా నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు, దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.

  25. నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.