Skip to content

Stones గురించి బైబిల్ వచనాలు

79 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మర్నాడు తెల్లవారినప్పుడు యాకోబు తన తలగడగా పెట్టుకున్న రాయిని తీసుకుని, దానిని స్తంభంగా నిలిపి, దాని మీదుగా నూనె పోశాడు.

  2. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది.

  3. తర్వాత యాకోబు మ్రొక్కుబడి చేస్తూ ఇలా అన్నాడు, “దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను ఈ ప్రయాణంలో కాపాడి నాకు తినడానికి ఆహారం ఇచ్చి వేసుకోడానికి వస్త్రాలు ఇచ్చి నన్ను నా తండ్రి ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవాయే నా దేవుడుగా ఉంటారు, స్తంభంగా నేను నిలబెట్టిన ఈ రాయి దేవుని మందిరంగా ఉంటుంది. అంతేకాక, నీవు నాకు ఇచ్చే అంతటిలో నుండి నేను నీకు పదవ భాగం ఇస్తాను” అని ఆయనకు మ్రొక్కుబడి చేసుకున్నాడు.

  4. So that I come again to my father's house in peace; then shall the LORD be my God:

  5. And this stone, which I have set for a pillar, shall be God's house: and of all that thou shalt give me I will surely give the tenth unto thee.

  6. కాబట్టి యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాడు.

  7. అతడు తన బంధువులతో, “కొన్ని రాళ్లు పోగు చేయండి” అని అన్నాడు. వారు రాళ్లు తెచ్చి కుప్పగా పోశారు, ఆ రాళ్లకుప్ప దగ్గర వారు భోజనం చేశారు.

  8. లాబాను దానికి యెగర్ శాహదూతా అని పేరు పెట్టాడు, యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాడు.

  9. లాబాను, “ఈ రోజున ఈ రాళ్ల గుట్ట నీకు, నాకు మధ్య సాక్షి” అన్నాడు. అందుకే అది గలీదు అని పిలువబడింది.

  10. ఈ స్థలం మిస్పా అని కూడా పిలువబడేది, ఎందుకంటే అతడు అన్నాడు, “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవా నాకు నీకు మధ్య జరిగేది గమనించును గాక.

  11. నీవు నా కుమార్తెలను బాధ పెడితే లేదా నా కుమార్తెలు ఉన్నా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకుంటే, మనతో ఎవరు లేకపోయినా, మన మధ్యలో సాక్షిగా దేవుడు ఉన్నారని గుర్తుంచుకో.”

  12. లాబాను ఇంకా యాకోబుతో, “ఇదిగో రాళ్లకుప్ప, ఇదిగో నీకు నాకు మధ్య నిలబెట్టబడి ఉన్న ఈ రాతి స్తంభము.

  13. ఈ రాళ్లకుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి, నీకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నేను రాను, నాకు హాని చేయడానికి ఈ రాళ్లకుప్ప, స్తంభం దాటి నీవు రావద్దు.

  14. అప్పుడు యెహోవా మోషేతో, “నీవు పర్వతం ఎక్కి, నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఉండు, నీవు వారికి బోధించడానికి నేను రాతిపలకలపై నియమాలను ఆజ్ఞలను వ్రాసి ఇస్తాను” అని చెప్పారు.

  15. యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత, ఆయన ఒడంబడిక పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతిపలకలను అతనికి ఇచ్చారు.

  16. యెహోవా మోషేతో, “మొదటి పలకలవంటి మరో రెండు రాతిపలకలను చెక్కు, నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే నేను వాటిపై వ్రాస్తాను.

  17. నీవు ఉదయమే సిద్ధపడి, సీనాయి పర్వతం మీదికి రా. ఆ పర్వత శిఖరం మీద నీవు నా ఎదుట నిలబడు.

  18. నీతో మరెవరూ రాకూడదు, ఈ పర్వతం మీద ఎవరూ కనపడకూడదు; ఈ పర్వతం దగ్గర పశువులు గాని గొర్రెలు గాని మేయకూడదు” అని చెప్పారు.

  19. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మొదటి వాటిలా రెండు రాతిపలకలను చెక్కి తన చేతులతో ఆ రెండు రాతిపలకలు పట్టుకుని తెల్లవారుజామునే సీనాయి పర్వతం పైకి వెళ్లాడు.

  20. ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు.

  21. అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు.

  22. ఈ ఆజ్ఞలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని, మేఘం, కటిక చీకటిలో నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటికి ప్రకటించారు; ఆయన ఇంకా ఏది కలుపలేదు. ఆ తర్వాత ఆయన రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చారు.

  23. రాతిపలకలు అనగా, యెహోవా మీతో చేసిన నిబంధనకు సంబంధించి పలకలను తీసుకోవడానికి నేను పర్వతం మీదికి ఎక్కి వెళ్లినప్పుడు, ఆ పర్వతం మీద నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను; నేను ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు.

  24. దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతిపలకలను యెహోవా నాకు ఇచ్చారు. మీరందరు సమావేశమైన రోజున పర్వతం మీద అగ్ని మధ్యలో నుండి యెహోవా మీకు ప్రకటించిన ఆజ్ఞలు ఆ పలకల మీద ఉన్నాయి.

  25. నలభై పగళ్లు, నలభై రాత్రులు గడిచినప్పుడు, యెహోవా రెండు రాతిపలకలు అనగా, నిబంధనకు సంబంధించిన పలకలు నాకు ఇచ్చారు.