Skip to content

Sieges గురించి బైబిల్ వచనాలు

134 వచనాలు · 63 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు.

  2. అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు.

  3. అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు.

  4. “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.

  5. రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి,

  6. సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు.

  7. ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, నీ కోటలను బలపరచుకో! బురదలోకి దిగు, ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, ఇటుక బట్టీలను సిద్ధపరచు.

  8. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కాబట్టి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు.

  9. “యెరూషలేము పట్టణాన్ని సైన్యాలు చుట్టుముట్టాయని మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకోండి.