కంటెంట్‌కు వెళ్లండి

Self-Condemnation గురించి బైబిల్ వచనాలు

37 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “పంపడానికి అతని దగ్గర ఒకడే మిగిలాడు, తాను ఎంతో ప్రేమించే, తన కుమారుడు. ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, చివరిగా అతన్ని పంపాడు.

  2. “కాని వారు ఒకరితో ఒకరు, ‘ఇతడే వారసుడు, రండి, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని అనుకున్నారు.

  3. కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.

  4. “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు.

  5. మీరు ఈ లేఖనం చదువలేదా: “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;

  6. ఇది ప్రభువే చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.’”

  7. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులు తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి ఎలాగైనా ఆయనను బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని వారు ప్రజలకు భయపడి ఆయనను వదిలి వెళ్లిపోయారు.

  8. For I feared thee, because thou art an austere man: thou takest up that thou layedst not down, and reapest that thou didst not sow.

  9. “అందుకు ఆ యజమాని, ‘చెడ్డ దాసుడా, నీ నోటి మాటతోనే నీకు తీర్పు తీరుస్తాను! నేను పెట్టని చోట తీసుకొనేవాడినని, విత్తని చోట పంటను కోసేవాడినని, కఠినుడనని నీకు తెలుసు, అవునా?

  10. వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.

  11. సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకెళ్లి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు.

  12. ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు.