Skip to content

Retaliation గురించి బైబిల్ వచనాలు

38 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “తీర్పు తీర్చకండి. అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు.

  2. మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.

  3. తన కోసం బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయుల గ్రామానికి పంపారు.

  4. కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు.

  5. ఆయన శిష్యులైన యాకోబు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు.

  6. అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు.

  7. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు.

  8. చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. అందరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి.

  9. నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి.

  10. నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారని అర్థం కాబట్టి మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?

  11. అయితే మీరే మోసం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మీ సహోదర సహోదరీలకు కూడా అలాగే చేస్తున్నారు.

  12. మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.

  13. కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు.