Skip to content

Responsibility గురించి బైబిల్ వచనాలు

143 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే వారు దానిని బట్టి చస్తారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారు చస్తారు.

  2. అయితే దుర్మార్గులు తాము చేసిన దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.

  3. అతడు తాను చేసిన నేరాలన్నిటిని గమనించుకుని వాటిని చేయడం మానేశాడు కాబట్టి అతడు చనిపోడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.

  4. అయినా ఇశ్రాయేలీయులు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. ఇశ్రాయేలీయులారా! నా మార్గాలు అన్యాయమైనవా? కాని మీ మార్గాలే కదా అన్యాయమైనవి?

  5. “ఇశ్రాయేలు ప్రజలారా! ఎవరి ప్రవర్తనను బట్టి వారిని నేను శిక్షిస్తాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. పశ్చాత్తాపపడి మీ అక్రమాల కారణంగా మీరు శిక్షించబడకుండా వాటిని విడిచిపెట్టండి.

  6. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  7. “మనుష్యకుమారుడా, నీ ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను ఒక దేశం మీదికి ఖడ్గాన్ని రప్పించగా ఆ ప్రజలు తమలో ఒకరిని ఎంచుకుని అతన్ని తమ కావలివానిగా పెట్టుకుంటారు.

  8. అతడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదుతాడు,

  9. అప్పుడు ఒకవేళ ఎవరైనా బూర శబ్దం విని కూడా జాగ్రత్త పడకపోతే ఆ ఖడ్గం వచ్చి వారి ప్రాణాన్ని తీస్తుంది, వారి చావుకు వారే బాధ్యులు.

  10. వారు బూర శబ్దం విని కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. ఒకవేళ వారు ఆ హెచ్చరికకు జాగ్రత్తపడి ఉంటే, వారు తమ ప్రాణాలను కాపాడుకునేవారు.

  11. అయితే ఒకవేళ కావలివాడు దేశం మీదికి ఖడ్గం రావడం చూసి కూడా ప్రజలను హెచ్చరించడానికి బూర ఊదకపోతే, ఖడ్గం వచ్చి ఎవరినైనా చంపితే, చనిపోయినవారు తమ పాపాల కారణంగా చనిపోయినప్పటికి, నేను ఆ కావలివాన్ని బాధ్యున్ని చేస్తాను.’

  12. “మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు.

  13. నేను దుర్మార్గునితో, ‘దుర్మార్గుడా, నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, వారి మార్గాలను విడిచిపెట్టమని నీవు వాన్ని హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే వాని చావుకు నిన్ను బాధ్యున్ని చేస్తాను.

  14. అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా ఆ దుర్మార్గులు తమ దుష్టత్వాన్ని వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు, అయితే నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.

  15. “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు, “మా పాపాలు దోషాలు మాకు భారంగా ఉన్నాయి, వాటివలన మేము క్షీణించి పోతున్నాము; మేమెలా బ్రతకాలి?” అని అంటున్నారు.’

  16. నీవు వారితో ఇలా చెప్పు, ‘నా జీవం తోడు, దుర్మార్గులు చనిపోతే నాకు సంతోషం ఉండదు గాని వారు తమ చెడు మార్గాలు విడిచి బ్రతికితే నాకు సంతోషము. తిరగండి! మీ చెడు మార్గాల నుండి తిరగండి! ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చస్తారు?’ అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. “కాబట్టి మనుష్యకుమారుడా, నీ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఒకవేళ నీతిమంతులు పాపం చేస్తే, వారి గతంలోని నీతికి విలువ ఉండదు. అలాగే దుష్టులు పశ్చాత్తాపపడితే, వారి యొక్క గతంలోని దుష్టత్వం శిక్షను తీసుకురాదు. పాపం చేసే నీతిమంతులు గతంలో నీతిమంతులుగా ఉన్నప్పటికీ, వారు జీవించడానికి అనుమతించబడరు.’

  18. నీతిమంతులు తప్పక జీవిస్తారని నేను చెప్పినా సరే, వారు తమ నీతిని నమ్ముకొని పాపం చేస్తే, వారు చేసిన ఏ నీతికార్యాలు జ్ఞాపకం చేసుకోబడవు; వారు చేసిన పాపానికి వారు చస్తారు.

  19. అలాగే ఒకవేళ నేను దుర్మార్గులతో, ‘మీరు తప్పక చస్తారు’ అని చెప్తే, వారు తమ పాపాన్ని విడిచిపెట్టి, న్యాయమైనవి, సరియైనవి చేస్తూ,

  20. వారు అప్పు ఇచ్చినప్పుడు తాకట్టుగా పెట్టుకున్న వాటిని తిరిగి ఇస్తే, వారు దొంగిలించింది తిరిగి ఇస్తే, జీవితాన్ని ఇచ్చే శాసనాలను అనుసరిస్తూ కీడు చేయనట్లైతే; ఆ వారు ఖచ్చితంగా బ్రతుకుతారు; వారు చనిపోరు.

  21. వారు చేసిన పాపాల్లో ఏదీ జ్ఞాపకం చేసుకోబడదు. వారు న్యాయమైనవి, సరియైనవి చేశారు; కాబట్టి వారు ఖచ్చితంగా బ్రతుకుతారు.

  22. “అయినా నీ ప్రజలు, ‘యెహోవా మార్గం న్యాయమైనది కాదు’ అని అంటారు. కాని నిజానికి వారి విధానమే న్యాయమైనది కాదు.

  23. నీతిమంతులు తమ నీతిని విడిచిపెట్టి చెడు చేస్తే, ఆ పాపాన్ని బట్టి వారు చస్తారు.

  24. దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి న్యాయమైనవి, సరియైనవి చేస్తే, వాటిని బట్టి వారు బ్రతుకుతారు.

  25. మీరు ఏ పట్టణంలో గాని గ్రామంలో గాని ప్రవేశించినప్పుడు అక్కడ యోగ్యులెవరో అడిగి తెలుసుకొని అక్కడినుండి వెళ్లేవరకు ఆ ఇంట్లోనే బసచేయండి.