కంటెంట్‌కు వెళ్లండి

Reptiles గురించి బైబిల్ వచనాలు: Unclean and not eaten

9 వచనాలు · 21 కోణాలు

Unclean and not eaten గురించి వచనాలు

  1. భూమి మీద కదిలే వాటన్నిటిలో, ఇవి మీకు నిషేధమైనవి. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాన్ని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  2. దాని కళేబరంలో ఎవరైనా ఏదైనా తింటే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. కళేబరాన్ని ఎవరైనా మోస్తే వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  3. “ ‘నేలపై ప్రాకే జీవులన్నీ అపవిత్రమైనవి; దానిని తినకూడదు.

  4. నేలమీద ప్రాకే జీవులలో పొట్ట మీద ప్రాకేవైనా లేదా నాలుగు కాళ్లతో లేదా అంతకన్నా ఎక్కువ కాళ్లతో నడిచేవైనా అవి మీకు అపవిత్రమైనవి.

  5. ప్రాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటిని బట్టి గాని వాటి ద్వారా గాని మీరు అపవిత్రం కాకూడదు.

  6. అప్పుడతడు పరలోకం తెరువబడి నాలుగు మూలలు పట్టుకోబడి భూమి మీదకు దింపబడుతున్న ఒక పెద్ద దుప్పటి వంటి దాన్ని చూశాడు.

  7. దానిలో నాలుగు కాళ్లున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు పక్షులు ఉన్నాయి.

  8. అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.”

  9. అందుకు పేతురు, “లేదు, ప్రభువా! నేను అపరిశుభ్రమైనది అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు.