కంటెంట్‌కు వెళ్లండి

Rachel గురించి బైబిల్ వచనాలు: Steals the household images of her father

10 వచనాలు · 6 కోణాలు

Steals the household images of her father గురించి వచనాలు

  1. యాకోబు తన మందలు ఉన్న పొలం దగ్గరకు రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు.

  2. అప్పుడు రాహేలు, లేయా జవాబిస్తూ, “మా తండ్రి స్వాస్థ్యంలో మాకు ఇంకా ఏమైనా పాలుపంపులు ఉన్నాయా?

  3. అతడు మమ్మల్ని విదేశీయులుగా చూడట్లేదా? మమ్మల్ని అమ్మివేయడమే కాక, మాకు రావలసింది అతనే వాడుకున్నాడు.

  4. దేవుడు మా తండ్రి దగ్గర తీసివేసిన ఆస్తి ఖచ్చితంగా మనకు మన పిల్లలకు చెందినది. కాబట్టి దేవుడు నీకేమి చెప్తే అది చేయి” అని అన్నారు.

  5. కాబట్టి యాకోబు తన పిల్లలను భార్యలను ఒంటెలపై ఎక్కించి,

  6. తన ముందు పశువులను పంపుతూ, తాను పద్దనరాములో సంపాదించుకున్న అన్నిటితో కలిసి, కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు బయలుదేరాడు.

  7. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించే పనిమీద వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతలను దొంగిలించింది.

  8. లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు.

  9. రాహేలు ఆ గృహదేవతల విగ్రహాలను ఒంటె సామాగ్రిలో దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికాడు కానీ అతనికి ఏమి దొరకలేదు.

  10. రాహేలు తన తండ్రితో, “నా ప్రభువా! నాపై కోప్పడకండి, నేను మీ ఎదుట లేవలేను, నేను నెలసరిలో ఉన్నాను” అని చెప్పింది. కాబట్టి లాబాను వెదకినా అతనికి తన గృహదేవతల విగ్రహాలు దొరకలేదు.