Skip to content

Month గురించి బైబిల్ వచనాలు

22 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి.

  2. ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది.

  3. ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  4. మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  5. అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.

  6. రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  7. మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  8. ఈ బెనాయా పరాక్రమశాలి, ముప్పైమంది వీరులలో ఒకనిగా, ఆ ముప్పైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని కుమారుడైన అమ్మీజాబాదు అతని విభాగంలో అధిపతిగా ఉన్నాడు.

  9. నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  10. అయిదవ నెలకు ఇశ్రాహేతీయుడైన షంహూతు అయిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  11. ఆరవ నెలకు తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, ఆరవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  12. ఏడవ నెలకు ఎఫ్రాయిమీయుడు పెలోనీయుడైన హేలెస్సు ఏడవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  13. ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  14. తొమ్మిదవ నెలకు బెన్యామీనీయుడు అనాతోతీయుడైన అబీయెజెరు తొమ్మిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  15. పదవ నెలకు జెరహీయుడు, నెటోపాతీయుడైన మహరై పదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  16. పదకొండవ నెలకు ఎఫ్రాయిమీయుడు పిరాతోనీయుడునైన బెనాయా పదకొండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  17. పన్నెండవ నెలకు నెటోపాతీయుడునైన ఒత్నీయేలు వంశస్థుడైన హెల్దయి పన్నెండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  18. మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.

  19. యూదారాజు యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో అయిదవ సంవత్సరం తొమ్మిదవ నెలలో, యెరూషలేములోని ప్రజలందరికి, యూదా పట్టణాల నుండి వచ్చిన ప్రజలందరికి యెహోవా సన్నిధిలో ఉపవాసం ఉండాలని ప్రకటించబడింది.

  20. అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు.

  21. రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది.

  22. అయితే ఆలయం బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని అణగద్రొక్కుతారు.