కంటెంట్‌కు వెళ్లండి

Missionary Work By Ministers గురించి బైబిల్ వచనాలు: Christ sent his disciples to labour in

13 వచనాలు · 32 కోణాలు

"Missionary Work By Ministers" కోసం వెతకండి

Christ sent his disciples to labour in గురించి వచనాలు

  1. తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండుమందిని నియమించుకొని

  2. ఆయన పన్నెండుమందిని దగ్గరకు పిలిచి అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి వారికి అధికారం ఇచ్చి, వారిని ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టారు.

  3. ఆ తర్వాత ప్రభువు ఇంకా డెబ్బైరెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరిగా తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి స్థలానికి తనకు ముందుగా వారిని పంపారు.

  4. ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.

  5. వెళ్లండి! నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లల్లా పంపుతున్నాను.

  6. మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు.

  7. “మీరు ఒక ఇంట్లో ప్రవేశించినప్పుడు, మొదట, ‘ఈ ఇంటికి సమాధానం కలుగును గాక’ అని చెప్పండి.

  8. ఒకవేళ అక్కడ సమాధానం కోరేవారుంటే, మీ సమాధానం వారి మీద నిలుస్తుంది; ఒకవేళ లేకపోతే, అది మీకే తిరిగి వస్తుంది.

  9. వారు ఏది ఇచ్చినా తింటూ త్రాగుతూ, అక్కడే ఉండండి, ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.

  10. “మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, వారు మిమ్మల్ని చేర్చుకొంటే, వారు మీకు ఇచ్చే వాటిని తినండి.

  11. అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచండి, ‘దేవుని రాజ్యం సమీపించింది’ అని వారితో చెప్పండి.

  12. అయితే మీరు ఒక గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు, అక్కడి వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు ఆ గ్రామ వీధులలోనికి వెళ్లి,

  13. ‘మీకు హెచ్చరికగా మా పాదాల దుమ్మును కూడా దులిపి వేస్తున్నాము. అయినా దేవుని రాజ్యం సమీపించింది’ అని తెలుసుకోండి.