కంటెంట్‌కు వెళ్లండి

Miracles Through Evil Agents గురించి బైబిల్ వచనాలు: Witch of Endor

8 వచనాలు · 10 కోణాలు

"Miracles Through Evil Agents" కోసం వెతకండి

Witch of Endor గురించి వచనాలు

  1. సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.

  2. కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.

  3. అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో నీకు తెలుసు కదా; అతడు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో ఉండకుండ వారిని తొలగించాడు. నాకు మరణం వచ్చేలా నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగిస్తున్నావు?” అన్నది.

  4. అందుకు సౌలు ఆమెతో, “సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, ఇలా చేసినందుకు నీవు శిక్షించబడవు” అని యెహోవాను బట్టి ప్రమాణం చేశాడు.

  5. అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది. అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.

  6. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు చాలా గట్టిగా కేక వేసి, “నీవు సౌలువే కదా నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని సౌలును అడిగింది.

  7. అందుకు రాజు ఆమెతో, “భయపడకు, నీకు ఏమి కనబడింది?” అని అడిగాడు. ఆమె, “దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూశాను” అని చెప్పింది.

  8. అందుకు, “అతని రూపం ఎలా ఉంది?” అని అడిగాడు. ఆమె, “దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అన్నది. సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని మోకరించి సాష్టాంగపడ్డాడు.