Skip to content

Masters గురించి బైబిల్ వచనాలు

35 వచనాలు · 26 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “అక్రమంతో తన రాజభవనాన్ని, అన్యాయంతో తన మేడగదులను కట్టించుకునే వారికి శ్రమ, ఏమి చెల్లించకుండ తన సొంత ప్రజలతో పని చేయించుకుని, వారి ప్రయాసానికి తగిన వేతనం ఇవ్వని వారికి శ్రమ.

  2. అక్కడ శతాధిపతికి ఎంతో ఇష్టమైన పనివాడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు.

  3. ఆ శతాధిపతి యేసు గురించి విని, యేసును వచ్చి తన దాసుని స్వస్థపరచుమని బ్రతిమాలడానికి యూదా నాయకుల్లో కొందరిని ఆయన దగ్గరకు పంపించాడు.

  4. అతడు అతని కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగినవారు; అవసరంలో ఉన్న ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేస్తూ క్రమంగా దేవునికి ప్రార్థన చేసేవాడు.

  5. అయితే యజమానులారా, మీరు కూడా మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. ఎందుకంటే మీ ఇద్దరి యజమాని పరలోకంలో ఉన్నారు, ఆయన పక్షపాతం చూపడని మీకు తెలుసు కాబట్టి వారిని బెదిరించకండి.

  6. బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాల్లో వారికి లోబడి ఉండండి.

  7. యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి, మీ దాసులకు సరియైనది న్యాయమైనది ఇవ్వండి.

  8. ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు.

  9. చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.

  10. దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి.