Masters గురించి బైబిల్ వచనాలు: Observe the Sabbath
Observe the Sabbath గురించి వచనాలు
కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు.
యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.
ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,
కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు.