Skip to content

Jehoahaz గురించి బైబిల్ వచనాలు

19 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యూదారాజు అహజ్యా కుమారుడైన యోవాషు పరిపాలనలోని ఇరవై మూడవ సంవత్సరంలో యెహు కుమారుడు యెహోయాహాజు ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు, అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు.

  2. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు.

  3. కాబట్టి యెహోవాకు ఇశ్రాయేలు మీద కోపం రగులుకుంది, చాలాసార్లు ఆయన వారిని అరాము రాజైన హజాయేలు, అతని కుమారుడు బెన్-హదదు చేతులకు అప్పగించారు.

  4. అప్పుడు యెహోయాహాజు యెహోవాను వేడుకోగా, యెహోవా అతన్ని ప్రార్థన విన్నారు, ఎందుకంటే అరాము రాజు ఇశ్రాయేలును ఎలా తీవ్రంగా హింసిస్తున్నాడో చూశారు.

  5. యెహోవా ఇశ్రాయేలుకు ఒక రక్షకుని ప్రసాదించారు, అతని ద్వారా వారు అరాము అధికారం నుండి తప్పించుకున్నారు. కాబట్టి మునుపటిలా ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళలో నివసించారు.

  6. అయితే వారు ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన యరొబాము కుటుంబీకులు చేసిన పాపాలను చేస్తూనే ఉన్నారు. అంతేకాక, అషేరా స్తంభం అలాగే సమరయలో నిలిచి ఉంది.

  7. యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.

  8. యెహోయాహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, అతని విజయాలు, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  9. యెహోయాహాజు చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని సమరయలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాషు రాజయ్యాడు.

  10. యెషీయా సేవకులు అతని మృతదేహాన్ని మెగిద్దో నుండి యెరూషలేముకు రథంలో తీసుకువచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.

  11. యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి యిర్మీయా కుమార్తెయైన హమూటలు, ఆమె లిబ్నా పట్టణస్థురాలు.

  12. అతడు యెరూషలేములో పరిపాలించకుండా ఫరో నెకో అతన్ని హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఖైదీగా చేశాడు, యూదా మీద వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.

  13. ఫరో నెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును యోషీయా స్థానంలో రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు, అతడు అక్కడ చనిపోయాడు.

  14. ఫరో నెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీము అతనికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద పన్ను నిర్ణయించి దేశ ప్రజల నుండి వెండి బంగారాలు వసూలు చేయించాడు.

  15. తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.

  16. ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు.

  17. చనిపోయిన రాజు కోసం ఏడవవద్దు అతన్ని కోల్పోయినందుకు దుఃఖించవద్దు; దానికి బదులు, బందీలుగా కొనిపోబడినవారి కోసం తీవ్రంగా ఏడవండి, ఎందుకంటే వారు ఎప్పటికీ తిరిగి రారు, తన స్వదేశాన్ని మళ్ళీ చూడరు.

  18. తన తండ్రి తర్వాత యూదా రాజుగా ఆసీనుడైన యోషీయా కుమారుడైన షల్లూము గురించి యెహోవా ఇలా అంటున్నారు: “అతడు ఎప్పటికీ తిరిగి రాడు.

  19. వారు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతడు చనిపోతాడు; అతడు మళ్ళీ ఈ దేశాన్ని చూడడు.”