Father-in-Law గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు.
కాబట్టి లాబాను ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి విందు చేశాడు.
అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు.
అడవి మృగాలు ద్వార చీల్చబడిన జంతువులను నీ దగ్గరకు తేలేదు; ఆ నష్టం నేనే భరించాను. పగలైనా, రాత్రైనా దొంగిలించబడిన దానికి నీవు నన్ను నష్టపరిహారం అడిగావు.
నా పరిస్థితి ఇది: పగలు ఎండ రాత్రి చలి నన్ను క్షీణింపజేశాయి, నిద్ర నా కళ్ళకు దూరమైంది.
నీ ఇంట్లో ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా ఉండేది. నీ ఇద్దరు కుమార్తెల కోసం పద్నాలుగు సంవత్సరాలు, నీ మంద కోసం ఆరు సంవత్సరాలు పని చేశాను, అయితే నీవు పదిసార్లు నా జీతం మార్చావు.
ఒకవేళ నా తండ్రి యొక్క దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు నాకు తోడుగా లేకపోతే, నీవు నన్ను ఖచ్చితంగా ఖాళీ చేతులతో పంపియుండేవాడివి. కానీ దేవుడు నా ప్రయాసను, నా చేతి కష్టాన్ని చూశారు, గత రాత్రి నిన్ను గద్దించారు.”
ఆమె భర్త తనను బ్రతిమాలి తీసుకువద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్తూ తనతో తన పనివాన్ని, రెండు గాడిదలను తీసుకెళ్లాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.
ఆమె తండ్రి అనగా అతని మామ అతన్ని ఉండమని బలవంతం చేశాడు; కాబట్టి అతడు మూడు రోజులు అతని దగ్గరే తింటూ, త్రాగుతూ, పడుకుంటూ అక్కడే ఉన్నాడు.
నాలుగవ రోజు వారు ప్రొద్దున్నే లేచి లేవీయుడు వెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని ఆమె తండ్రి తన అల్లుడితో, “భోజనం చేసి సేదతీరిన తర్వాత వెళ్లవచ్చు” అన్నాడు.
కాబట్టి వారిద్దరు కూర్చుని కలిసి తిని త్రాగారు. తర్వాత ఆమె తండ్రి తన అల్లునితో, “దయచేసి ఈ రాత్రి సరదాగా గడుపు” అని అన్నాడు.
ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.
అయిదవ రోజు ప్రొద్దున అతడు వెళ్లడానికి లేచినప్పుడు, ఆమె తండ్రి, “మధ్యాహ్నం వరకు ఉండి కొంచెం సేద తీర్చుకో” అన్నాడు. కాబట్టి వారిద్దరు కలిసి భోజనం చేశారు.
తర్వాత అతడు తన ఉంపుడుగత్తె, తన పనివానితో కలిసి వెళ్లడానికి లేచినప్పుడు, అతని మామ, “ఇదిగో చూడు, సాయంత్రం అవుతుంది, రాత్రి ఇక్కడ గడిపి ప్రొద్దున్నే లేచి మీ దారిన మీ ఇంటికి వెళ్లవచ్చు” అన్నాడు.