Skip to content

Ephesus గురించి బైబిల్ వచనాలు

45 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు.

  2. వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.

  3. వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు.

  4. కానీ వెళ్లేముందు వారితో, “దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను” అని వాగ్దానం చేసి, ఎఫెసులో ఓడ ఎక్కి బయలుదేరాడు.

  5. అతడు కైసరయ తీరాన దిగి, యెరూషలేముకు వెళ్లి సంఘాన్ని పలకరించాడు మళ్ళీ అక్కడినుండి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చాడు.

  6. అంతియొకయలో కొంతకాలం గడిపిన తర్వాత, పౌలు అక్కడినుండి బయలుదేరి గలతీయ ఫ్రుగియ పరిసర ప్రాంతాలంతట, ఒక స్థలం నుండి మరొక స్థలానికి తిరుగుతూ శిష్యులందరిని బలపరిచాడు.

  7. ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాల్లో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు.

  8. అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికీ చాలా ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు.

  9. అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.

  10. అపొల్లో అకాయ ప్రాంతానికి వెళ్లాలని తలంచినప్పుడు అక్కడి సహోదరి సహోదరులు అతన్ని ప్రోత్సహించి, అతన్ని చేర్చుకోవాలని అకాయలోని శిష్యులకు ఉత్తరాన్ని వ్రాసి పంపారు. అతడు అక్కడికి చేరినప్పుడు కృప చేత నమ్మిన వారికి అతడు గొప్ప సహాయంగా నిలిచాడు.

  11. ఎందుకంటే, అతడు లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అని నిరూపిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న యూదుల వాదనలను బహిరంగంగా గట్టిగా ఖండించాడు.

  12. కొందరు యూదులు యేసు ప్రభువు నామాన్ని ఉపయోగిస్తూ, దయ్యం పట్టిన వారిలోని దురాత్మలను వెళ్లగొట్టడానికి బయలుదేరారు. వారు, “పౌలు ప్రకటిస్తున్న యేసు నామమున బయటకు రమ్మని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను” అన్నారు.

  13. యూదుల ముఖ్య యాజకుడు స్కెవ ఏడుగురు కుమారులు ఈ విధంగా చేస్తూ వచ్చారు.

  14. ఒక రోజు దురాత్మ వారిని, “యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, కాని మీరెవరు?” అని అడిగింది.

  15. ఆ దురాత్మ పట్టినవాడు వారి మీద పడి వారిని లోబరచుకుని దాడి చేయగా వారు రక్తం కారుతున్న గాయాలతో దిగంబరులుగా ఆ ఇంటి నుండి పారిపోయారు.

  16. పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురతలో ఉన్నాడు కాబట్టి, అతడు ఆసియా ప్రాంతంలో సమయం వ్యర్థం చేయకూడదని ఎఫెసు పట్టణం దాటి పోవడానికి నిర్ణయించుకొన్నాడు.

  17. పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.

  18. వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు.

  19. నాకు విరోధంగా యూదులు చేసిన కుట్రల వలన నేను ఎదుర్కొన్న శ్రమల మధ్యలో కూడా నేను కన్నీరు విడుస్తు, మిక్కిలి వినయంగా ప్రభువును సేవించాను.

  20. మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు.

  21. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను.

  22. “ఇప్పుడు, నేను ఆత్మ చేత బలవంతం చేయబడి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి జరుగబోతుందో తెలియదు.

  23. ప్రతి పట్టణంలో నా కోసం సంకెళ్ళు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు.

  24. అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.

  25. “నేను మీ మధ్య తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ప్రకటించాను కానీ మీలో ఎవరూ మళ్ళీ నన్ను చూడరని నాకు తెలుసు.