- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Damascus గురించి బైబిల్ వచనాలు: Paul's experiences in
Paul's experiences in గురించి వచనాలు
ఈ విషయాల గురించి ప్రధాన యాజకుడు న్యాయసభ సభ్యులందరు సాక్ష్యం ఇవ్వగలరు. దమస్కులోని వారి సహచరులకు ఇవ్వవలసిన ఉత్తరాలు కూడా నేను వారి దగ్గరి నుండి తీసుకుని, శిక్షించబడడానికి వీరిని బందీలుగా యెరూషలేముకు తీసుకురావడానికి వెళ్లాను.
“నేను దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, మధ్యాహ్న సమయంలో, అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.
నేను నేల మీద పడి ఒక స్వరం నాతో, ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అనడం విన్నాను.
“అందుకు నేను, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాను. “అప్పుడు ఆ స్వరం నాతో, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అని జవాబిచ్చాడు.
నాతో ఉన్నవారు వెలుగును చూశారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.
“ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. “అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు.
ప్రకాశమానమైన ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేసినందుకు, నాతో ఉన్నవారు నా చేతిని పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.
“అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు.
అతడు నా ప్రక్కన నిలబడి, ‘సహోదరుడా సౌలు చూపుపొందుకో!’ అన్నాడు. వెంటనే నేను అతన్ని చూడగలిగాను.
“అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు.
నీవు చూసి వినిన దాని గురించి ప్రజలందరికి చెప్పే సాక్షిగా ఉంటావు.
నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’
“అలా చేస్తూ ఒక రోజు నేను ముఖ్య యాజకుల నుండి అధికార పత్రం తీసుకుని దమస్కు పట్టణానికి బయలుదేరాను.
అగ్రిప్ప రాజా, ఇంచుమించు మధ్యాహ్న సమయంలో, నేను దారిలో ఉన్నప్పుడు, సూర్యుని కన్న ప్రకాశమైన వెలుగు పరలోకం నుండి వచ్చి నా చుట్టూ నాతో ఉన్న వారి చుట్టూ ప్రకాశించడం నేను చూశాను.
అప్పుడు మేమందరం నేల మీద పడిపోయాం, అప్పుడు హెబ్రీ భాషలో నాతో, ‘సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? మునికోలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని ఒక స్వరం చెప్పడం విన్నాను.
“అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,
నీవు లేచి నిలబడు, ఇకమీదట నీవు నా గురించి చూసినవాటికి చూడబోయే వాటికి సాక్షిగా సేవకునిగా నిన్ను నియమించడానికే నేను నీకు ప్రత్యక్షమయ్యాను.
నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను.
వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కళ్ళను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.
“కాబట్టి, అగ్రిప్ప రాజా, పరలోకం నుండి వచ్చిన దర్శనానికి నేను అవిధేయత చూపలేను.
మొదట దమస్కులో ఉన్నవారికి, తర్వాత యెరూషలేములో ఉన్నవారికి యూదయ ప్రాంతమంతటిలో ఉన్నవారందరికి, ఆ తర్వాత యూదేతరులకు పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరగమని మారుమనస్సు పొందిన కార్యాలను చేయాలని నేను ప్రకటించాను.