Skip to content

Contentment గురించి బైబిల్ వచనాలు

20 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. రాజు, “నాతో పాటు నది దాటి యెరూషలేములో నా దగ్గరే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.

  2. అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను.

  3. నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి?

  4. నీ సేవకుడనైన నేను యొర్దాను నది దాటి రాజుతో కలిసి కొంత దూరం వస్తాను. కానీ నా ప్రభువైన రాజుకు నీ సేవకుడనైన నేనెందుకు భారమవ్వాలి?

  5. నేను నా ఊరిలో నా తలిదండ్రుల సమాధి దగ్గరే చనిపోవడానికి మీ సేవకుడనైన నన్ను తిరిగి వెళ్లనివ్వండి. అయితే ఇక్కడ నా సేవకుడైన కింహాము ఉన్నాడు. అతన్ని నా ప్రభువైన రాజుతో కలిసి నది దాటనివ్వండి. మీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చెయ్యండి” అని అన్నాడు.

  6. మనుష్యులు జీవించినంత కాలం సంతోషంగా ఉంటూ, మంచి చేయడం కంటే ఉత్తమమైనది ఏదీ లేదని నేను తెలుసుకున్నాను.

  7. ప్రతి ఒక్కరు తిని త్రాగుతూ తన కష్టార్జితాన్ని ఆస్వాదించడమే దేవుని వరమని నేను తెలుసుకున్నాను.

  8. మనుష్యులు పడే శ్రమ అంతా కడుపు కోసమే, అయినా వారి ఆశకు తృప్తి కలగదు.

  9. మూర్ఖుల కంటే జ్ఞానులకున్న ప్రయోజనం ఏముంది? ఇతరుల ఎదుట ఎలా జీవించాలో తెలుసుకున్న బీదవారికి లాభం ఏంటి?

  10. కోరిక వెంట పడడం కంటే కళ్లకు కనిపించేది మేలు. అయినా ఇది కూడా అర్థరహితమే. గాలికి ప్రయాసపడడమే.

  11. వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు.

  12. ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో, ఎప్పుడూ తలకు నూనె రాసుకో.

  13. సూర్యుని క్రింద దేవుడు మీకు ఇచ్చిన ఈ అర్థరహితమైన జీవితకాలమంతా మీరు ప్రేమించే మీ భార్యతో జీవితాన్ని ఆస్వాదించండి; ఎందుకంటే ఇది మీ జీవితంలో సూర్యుని క్రింద మీరు పడిన కష్టంలో మీకు లభించే భాగము.

  14. ప్రతి ఒక్కరూ దేవుడు ఏ స్థితిలో తమను పిలిచారో ఆ స్థితిలోనే ఉండాలి.

  15. పిలిచినప్పుడు నీవు దాసునిగా ఉన్నావా? దాని గురించి బాధపడవద్దు; నీవు స్వాతంత్ర్యం పొందుకోగలిగితే స్వాతంత్ర్యం పొందుకో.

  16. నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.

  17. దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.

  18. అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.

  19. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము.

  20. కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి.