Skip to content

Chiding గురించి బైబిల్ వచనాలు

40 వచనాలు · 11 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గొర్రెల మందల కోసం వేసే ఈలలు వినడానికి నీవెందుకు గొర్రెల దొడ్ల మధ్య ఉన్నావు? రూబేను ప్రాంతాల్లో తీవ్ర హృదయాన్వేషణ కలిగింది.

  2. గిలాదువారు యొర్దాను అవతల నివసించారు. దానీయులు ఓడల దగ్గర ఎందుకు తిరుగుతున్నారు? ఆషేరీయులు సముద్రతీరాన తమ ఓడరేవుల్లో ఉన్నారు.

  3. జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు; యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.

  4. “రాజులు వచ్చారు, పోరాడారు, కనాను రాజులు పోరాడారు. మెగిద్దో జలాల దగ్గర ఉన్న తానాకులో వారు వెండిని దోచుకోలేదు.

  5. నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.

  6. కీషోను వాగు, పురాతన వాగు, కీషోను వాగు వారిని తుడిచి వేసింది. నా ప్రాణమా, బలం తెచ్చుకుని సాగిపో!

  7. గుర్రాల డెక్కల శబ్దాలు దద్దరిల్లాయి, బలమైన గుర్రాలు వేగంగా దూసుకెళ్లాయి.

  8. యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.

  9. తర్వాత ఈ సంగతి తెలిసిన దావీదు, “నేరు కుమారుడైన అబ్నేరు రక్తం విషయంలో నేను నా రాజ్యం ఎప్పటికీ యెహోవా దృష్టిలో నిర్దోషులమే.

  10. ఈ హత్యచేసిన పాపం యోవాబు మీద అతని కుటుంబమంతటి మీదనే ఉంటుంది. యోవాబు కుటుంబంలో ఎప్పుడూ పుండ్లు పడినవారు, కుష్ఠురోగులు, కర్ర సహాయంతో నడిచేవారు, కత్తితో చంపబడినవారు, తిండిలేనివారు ఉంటారు” అని చెప్పాడు.

  11. (గిబియోను యుద్ధంలో అబ్నేరు తన సోదరుడైన అశాహేలును చంపినందుకు యోవాబు అతని సోదరుడైన అబీషై కలిసి పగతీర్చుకున్నారు.)

  12. దావీదు, “మీ బట్టలు చింపుకుని గోనెబట్ట వేసుకుని అబ్నేరు ముందు నడుస్తూ దుఃఖించండి” అని యోవాబుకు అతనితో ఉన్న ప్రజలందరికి ఆజ్ఞాపించి, రాజైన దావీదు కూడా పాడె వెంట నడిచాడు.

  13. యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు.

  14. మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది.

  15. ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.