Skip to content

Chastisement గురించి బైబిల్ వచనాలు: From God

54 వచనాలు · 1 కోణం

From God గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ దేవుడైన యెహోవా క్రమశిక్షణను చూసింది, అనుభవించింది మీ పిల్లలు కాదని ఈ రోజు జ్ఞాపకం చేసుకోండి: ఆయన మహిమను, ఆయన బలమైన హస్తాన్ని, ఆయన చాచిన చేయిని;

  2. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు అతని దేశమంతటికి ఆయన చేసిన అసాధారణ గుర్తులు;

  3. ఈజిప్టు సైన్యానికి, దాని గుర్రాలకు రథాలకు ఆయన చేసింది, వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రపు నీటితో వారిని కప్పివేయడం, యెహోవా వారిపై నిత్య నాశనం ఎలా తెచ్చారో మీరు చూశారు.

  4. మీరు ఈ చోటికి చేరుకునేవరకు అరణ్యంలో ఆయన మీ కోసం ఏమి చేశారో చూసింది మీ పిల్లలు కాదు.

  5. ఆయన రూబేనీయుడైన ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములకు చేసిన దానిని అనగా ఇశ్రాయేలీయులందరి మధ్యలో భూమి నోరు తెరిచి వారిని వారు కుటుంబాలను వారి గుడారాలను వారికి చెందిన ప్రతి జీవిని మ్రింగివేసిన విధానాన్ని మీరు చూశారు.

  6. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నిటిని చూసింది మీ సొంత కళ్లు.

  7. కాబట్టి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటిని పాటించండి, అప్పుడు మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్తున్న ఆ దేశంలోనికి వెళ్లడానికి బలం కలిగి ఉంటారు,

  8. తద్వార వారికి వారి సంతానానికి ఇస్తానని యెహోవా మీ పూర్వికులతో వాగ్దానం చేసిన దేశంలో అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అధిక కాలం జీవిస్తారు.

  9. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల దండంతో మనుష్యుల చేతుల దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను.

  10. నీ ముందు నుండి నేను తొలగించిన సౌలుకు దూరం చేసినట్లుగా అతనికి నా ప్రేమను దూరం చేయను.

  11. “మీ ఇశ్రాయేలు ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు వారి శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, వారు మీ వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఈ మందిరం ఎదుట మిమ్మల్ని వేడుకున్నప్పుడు,

  12. మీరు పరలోకం నుండి విని, మీ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశానికి వారిని మళ్ళీ తీసుకురండి.

  13. “మీ ప్రజలు మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, ఆకాశం మూయబడి వర్షం లేనప్పుడు, వారు తమకు కలిగిన శ్రమ వలన తమ పాపం విడిచిపెట్టి ఈ స్థలం వైపు తిరిగి మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ప్రార్థిస్తే,

  14. మీరు పరలోకం నుండి విని, మీ దాసులు, మీ ఇశ్రాయేలు ప్రజల పాపాన్ని క్షమించండి. సరైన మార్గాన్ని అనుసరిస్తూ జీవించాలని వారికి బోధించండి, మీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో వర్షం కురిపించండి.

  15. “దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,

  16. మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ వేదన బాధలు తెలుసుకొని ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే,

  17. ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),

  18. అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడి, మీకు విధేయులై మీ మార్గంలో వారు నడుస్తారు.

  19. “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని,

  20. ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను.

  21. యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.

  22. దుష్టుని కోసం గొయ్యి త్రవ్వబడే వరకు, ఇబ్బంది దినాల నుండి మీరు వారికి ఉపశమనం కలిగిస్తారు.

  23. చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

  24. అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.

  25. కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.