కంటెంట్‌కు వెళ్లండి

Barnabas గురించి బైబిల్ వచనాలు: Is sent as a commissioner to Jerusalem

9 వచనాలు · 14 కోణాలు

Is sent as a commissioner to Jerusalem గురించి వచనాలు

  1. పద్నాలుగు సంవత్సరాల తర్వాత తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్లాను.

  2. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను అక్కడ నాయకులుగా పేరొందిన వారితో ఏకాంతంగా సమావేశమై, నేను యూదేతరుల మధ్య ప్రకటిస్తున్న సువార్త గురించి వారికి తెలియజేశాను. నా పందెంలో నేను వ్యర్థంగా పరుగెత్తలేదని పరుగెత్తకూడదని ఖచ్చితంగా కోరుతున్నాను.

  3. నాతో యెరూషలేముకు వచ్చిన తీతు గ్రీసు దేశస్థుడైనప్పటికి సున్నతి పొందాలని అతన్ని బలవంత పెట్టలేదు.

  4. క్రీస్తు యేసులో మనకున్న స్వేచ్ఛపై నిఘా పెట్టడానికి మమ్మల్ని బానిసలుగా చేయడానికి మన మధ్యలోనికి చొరబడిన కొంతమంది అబద్ధపు విశ్వాసుల వలన ఈ విషయం తలెత్తింది.

  5. అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.

  6. కొంతమంది గొప్ప పేరుగాంచిన వారు ఉన్నప్పటికీ, వారెవరైనా సరే నేను లెక్కచేయను, ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు, అయినా వారు నా సందేశానికి ఏమి చేర్చలేదు.

  7. సున్నతి పొందిన వారి కోసం పేతురు నియమింపబడినట్లే, సున్నతి లేనివారికి సువార్త ప్రకటించే బాధ్యత నాకు అప్పగించబడిందని వారు గుర్తించారు.

  8. ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కోసం అపొస్తలునిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడే సున్నతిలేని యూదేతరుల కోసం అపొస్తలునిగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం ఇచ్చారు.

  9. సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు.