కంటెంట్‌కు వెళ్లండి

Adoption గురించి బైబిల్ వచనాలు: Should lead to holiness

6 వచనాలు · 38 కోణాలు

"Adoption" కోసం వెతకండి

Should lead to holiness గురించి వచనాలు

  1. కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.

  2. ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”

  3. ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.

  4. తద్వారా మీరు నిందలేనివారిగా, శుద్ధులుగా, “చెడిపోయిన వక్రమైన ఈ తరం మధ్యలో, మీరు దోషంలేని దేవుని బిడ్డలు” అవుతారు. మీరు జీవవాక్యాన్ని స్థిరంగా పట్టుకుని ఉన్నప్పుడు, మీరు ఆకాశంలోని నక్షత్రాల్లా వారి మధ్యలో ప్రకాశిస్తారు. అప్పుడు నేను వృధాగా పరుగు పెట్టలేదు లేదా శ్రమపడలేదని క్రీస్తు దినాన నేను అతిశయించగలను.

  5. ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము.

  6. ఆయనలో నిరీక్షణ ఉంచు ప్రతివారు, ఆయన పవిత్రుడై ఉన్నట్లే తనను పవిత్రునిగా చేసుకుంటారు.