circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 10:32సుమారు క్రీ.శ. 32
అలాగే ఒక లేవీయుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు.
- లూకా 10:33సుమారు క్రీ.శ. 32
అయితే ఒక సమరయుడు, ప్రయాణం చేస్తూ, వాడు పడి ఉన్న చోటికి వచ్చాడు; అతడు వానిని చూసినప్పుడు, వాని మీద జాలిపడ్డాడు.
- లూకా 10:34సుమారు క్రీ.శ. 32
అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.
- లూకా 10:35సుమారు క్రీ.శ. 32
మరునాడు అతడు రెండు దేనారాలు తీసి ఆ సత్రపు యజమానికి ఇచ్చాడు. ‘ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నీవు అధనంగా ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, నేను మళ్ళీ వచ్చినప్పుడు దానిని తిరిగి చెల్లిస్తాను’ అని అతనితో చెప్పి వెళ్లాడు.
- లూకా 10:36సుమారు క్రీ.శ. 32
“దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?” అని అతన్ని అడిగారు.
- లూకా 10:37సుమారు క్రీ.శ. 32
అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, “వాని పట్ల కనికరం చూపినవాడే” అని చెప్పాడు. యేసు అతనితో, “నీవు వెళ్లి అలాగే చేయి” అన్నారు.
- లూకా 10:38సుమారు క్రీ.శ. 32
యేసు ఆయన శిష్యులు దారిన వెళ్తూ, ఒక గ్రామానికి వచ్చారు. అక్కడ మార్త అనే పేరుగల స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది.
- లూకా 10:39సుమారు క్రీ.శ. 32
ఆమె సహోదరి పేరు మరియ, ఆమె ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధను వింటూ ఉంది.
- లూకా 10:40సుమారు క్రీ.శ. 32
అయితే మార్త తాను చేయాల్సిన ఏర్పాట్లపైనే దృష్టి పెట్టింది. ఆమె ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరి పనులన్నీ నాకే వదిలేసి ఇక్కడ కూర్చుంది అయినా నీవు పట్టించుకోవా? నాకు సహాయం చేయమని చెప్పండి!” అని అన్నది.
- లూకా 10:41సుమారు క్రీ.శ. 32
ప్రభువు ఆమెతో, “మార్తా, మార్తా, నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు,
- లూకా 10:42సుమారు క్రీ.శ. 32
కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.
- లూకా 11:1సుమారు క్రీ.శ. 33
ఒక రోజు యేసు ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, “ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించినట్లు మాకు నేర్పించు” అని ఆయనను అడిగాడు.
- లూకా 11:2సుమారు క్రీ.శ. 33
ఆయన వారితో, “మీరు ప్రార్థన చేసేప్పుడు: “ ‘తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక.
- లూకా 11:3సుమారు క్రీ.శ. 33
మా అనుదిన ఆహారం ప్రతిరోజు మాకు ఇవ్వండి.
- లూకా 11:4సుమారు క్రీ.శ. 33
మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”
- లూకా 11:5సుమారు క్రీ.శ. 33
ఆ తర్వాత యేసు వారితో, “మీలో ఒకరికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి, నీవు అర్థరాత్రి సమయంలో అతని దగ్గరకు వెళ్లి, ‘స్నేహితుడా, నా స్నేహితుడొకడు ప్రయాణం చేస్తూ, నా దగ్గరకు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఆహారమేమి లేదు కాబట్టి నాకు మూడు రొట్టెలిస్తావా?’ అని అడిగితే;
- లూకా 11:6సుమారు క్రీ.శ. 33
For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?
- లూకా 11:7సుమారు క్రీ.శ. 33
లోపల ఉన్నవాడు, ‘నన్ను ఇబ్బంది పెట్టకు, తలుపుకు తాళం వేసి ఉంది. నేను నా పిల్లలు పడుకున్నాము. నేను లేచి నీకు ఏమీ ఇవ్వలేను?’ అని అన్నాడనుకోండి.
- లూకా 11:8సుమారు క్రీ.శ. 33
నేను చెప్తున్న, మీకున్న స్నేహాన్ని బట్టి అతడు లేచి నీకు రొట్టె ఇవ్వకపోయినా, నీవు అంతగా సిగ్గువిడిచి అడిగావు కాబట్టి అతడు తప్పక లేచి, నీకు అవసరమైనంత ఇస్తాడు.
- లూకా 11:9సుమారు క్రీ.శ. 33
“అందుకే నేను మీకు చెప్తున్న: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
- లూకా 11:10సుమారు క్రీ.శ. 33
అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి, తలుపు తీయబడుతుంది.
- లూకా 11:11సుమారు క్రీ.శ. 33
“మీ తండ్రులలో ఎవరైనా, తన కుమారుడు, చేప అడిగితే పాము ఇస్తారా?
- లూకా 11:12సుమారు క్రీ.శ. 33
వాడు గ్రుడ్డు అడిగితే తేలు ఇస్తాడా?
- లూకా 11:13సుమారు క్రీ.శ. 33
మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి బహుమానాలను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా పరిశుద్ధాత్మను ఇస్తారు!”
- లూకా 11:14సుమారు క్రీ.శ. 33
ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు.