కంటెంట్‌కు వెళ్లండి

Uzziah

33 వచనాలు · 4 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Azariah, Ozias

Uzziah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.

  2. రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉండడం నేను చూశాను; ఆయన వస్త్రపు అంచు దేవాలయాన్ని నింపింది.

  3. యూదా రాజైన ఉజ్జియాకు పుట్టిన యోతాము కుమారుడైన ఆహాజు కాలంలో సిరియా రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చారు కాని అది వారు జయించలేకపోయారు.

  4. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పాలన కాలంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అనే ఇశ్రాయేలు రాజు కాలంలో, బెయేరి కుమారుడైన హోషేయకు యెహోవా వాక్కు వచ్చింది:

  5. యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.

  6. కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.

  7. ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా.

  8. ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా.