కంటెంట్‌కు వెళ్లండి

Pharaoh

138 వచనాలు

Pharaoh ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు ఇశ్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో దగ్గరకు వెళ్లి, “మీ సేవకుల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?

  2. వారు ఫరో దగ్గర నుండి వస్తున్నప్పుడు తమను కలవాలని ఎదురు చూస్తున్న మోషే అహరోనులను కలుసుకొని,

  3. వారు, “యెహోవా మిమ్మల్ని చూసి మిమ్మల్ని తీర్పు తీర్చును గాక! మీరు ఫరో ఎదుట అతని అధికారుల ఎదుట మమ్మల్ని చెడ్డవారిగా చేశారు, మమ్మల్ని చంపడానికి వారి చేతిలో కత్తి పెట్టారు” అని అన్నారు.

  4. నేను మీ నామాన్ని బట్టి ఫరోతో మాట్లాడడానికి వెళ్లినప్పటి నుండి అతడు ఈ ప్రజలను కష్టపెడుతున్నాడు. మీరు మీ ప్రజలను ఏమాత్రం విడిపించడంలేదు” అన్నాడు.

  5. అప్పుడు యెహోవా మోషేతో, “ఇప్పుడు నేను ఫరోకు ఏం చేయబోతున్నానో నీవు చూస్తావు: నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని వెళ్లనిస్తాడు; నా బలమైన హస్తాన్ని బట్టి అతడు వారిని తన దేశం నుండి తరిమివేస్తాడు” అన్నారు.

  6. “వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”

  7. అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.

  8. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.

  9. ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.

  10. ఆయన మోషేతో, “నేను యెహోవానై ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఈజిప్టు రాజైన ఫరోతో చెప్పు” అన్నారు.

  11. కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.

  12. అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “చూడు, నేను నిన్ను ఫరోకు దేవునిలా చేస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.

  13. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ నీవు చెప్పాలి, ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వాలని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పాలి.

  14. కాని నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, కాబట్టి ఈజిప్టు దేశంలో నా సూచనలను, అద్భుతాలను అధికంగా చేసినప్పటికీ,

  15. ఫరో మీ మాట వినడు. అప్పుడు నేను ఈజిప్టుపై నా చేతిని ఉంచి గొప్ప తీర్పు చర్యలతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం బయటకు తీసుకువస్తాను.

  16. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 సంవత్సరాలు అహరోనుకు 83 సంవత్సరాలు.

  17. “ ‘ఒక అద్భుతకార్యం చేయండి’ అని ఫరో మీతో చెప్పినప్పుడు, నీవు అహరోనుతో, ‘నీ చేతికర్రను తీసుకుని ఫరో ఎదుట పడవేయి’ అని చెప్పు. అది పాముగా మారుతుంది.”

  18. మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది పాముగా మారింది.

  19. ఫరో జ్ఞానులను మంత్రగాళ్ళను పిలిపించాడు. ఈజిప్టువారి మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో అలాగే చేశారు.

  20. కాని యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటను వినలేదు.

  21. తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఫరో హృదయం కఠినమైనది కాబట్టి అతడు ప్రజలను పంపించడానికి నిరాకరిస్తాడు.

  22. ఫరో నదికి వెళ్లేటప్పుడు ఉదయాన్నే నీవు అతని దగ్గరకు వెళ్లు. నైలు నది తీరాన నీవు అతనికి ఎదురు వెళ్లు. పాముగా మారిన కర్రను నీ చేతితో పట్టుకో.

  23. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.

  24. అయితే ఈజిప్టు మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో వాటిని చేశారు, అయితే యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటలను వినిపించుకోలేదు.

  25. దానికి బదులు, ఫరో తన రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు, కనీసం జరిగిన వాటి గురించి ఆలోచించలేదు.