కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  2. యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు,

  3. “ఇశ్రాయేలు ప్రజల్లో తొలి మగ సంతానం స్థానంలో నేను లేవీయులను తీసుకున్నాను. లేవీయులు నావారు,

  4. ఎందుకంటే తొలిసంతానమంతా నావారు. ఈజిప్టు తొలిసంతానాన్ని నేను మొత్తినప్పుడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల్లో, పశువుల్లో ప్రతి తొలిసంతానాన్ని, నా కోసం ప్రత్యేకపరచుకున్నాను. వారు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.”

  5. సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇలా అన్నారు.

  6. కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు.

  7. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అహరోనుల ద్వారా లెక్కించబడిన లేవీయులు, వారి వారి వంశాల ప్రకారం ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 22,000.

  8. యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.

  9. ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.”

  10. కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు.

  11. యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు.

  12. “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.

  13. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.

  14. యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు:

  15. యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు,

  16. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  17. సమావేశ గుడారం దగ్గర సేవచేసే కహాతు వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  18. సమావేశ గుడారం దగ్గర సేవ చేసిన గెర్షోను వంశాల మొత్తం లెక్క ఇది. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  19. మెరారి వంశాల మొత్తం లెక్క ఇది. మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞమేరకు మోషే అహరోనులు వారిని లెక్కించారు.

  20. మోషే ద్వార వచ్చిన యెహోవా ఆజ్ఞ ప్రకారం, వారందరికి వారి వారి పనులు, వారు మోయాల్సినవి అప్పగించబడ్డాయి. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, వారు లెక్కించబడ్డారు.

  21. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  22. పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”

  23. ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు.

  24. యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

  25. “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే,