కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈజిప్టువారికి ఇక మీరు బానిసలుగా ఉండకూడదని మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన మీ దేవుడనైన యెహోవాను నేనే; నేను మీ బానిసత్వ కాడి యొక్క పట్టీలను విరగ్గొట్టాను, మిమ్మల్ని తలలు పైకెత్తి నడిచేలా చేశాను.

  2. “ ‘కానీ మీరు నా మాట వినకపోతే, ఈ ఆజ్ఞలన్నిటిని పాటించకపోతే,

  3. మీరు నా శాసనాలను తిరస్కరించి, నా చట్టాలను అసహ్యించుకుని నా ఆజ్ఞలన్నిటిని పాటించడంలో విఫలమై, నా నిబంధనను ఉల్లంఘిస్తే,

  4. అప్పుడు నేను మీకు ఇలా చేస్తాను: మీ దృష్టిని నాశనం చేసే, మీ బలాన్ని తగ్గించే ఆకస్మిక భీభత్సం, చెడు వ్యాధులు జ్వరాలు తెస్తాను. మీరు వృధాగా విత్తనాన్ని చల్లుతారు, ఎందుకంటే మీ శత్రువులు దానిని తింటారు.

  5. నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.

  6. “ ‘ఇదంతటి తర్వాత మీరు నా మాట వినకపోతే, నేను మీ పాపాల కోసం మిమ్మల్ని ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాను.

  7. నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.

  8. “ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.

  9. మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.

  10. “ ‘ఇవన్నీ జరిగినా కూడా నా దిద్దుబాటును అంగీకరించకుండా నాకు విరుద్ధంగా ఉండడం కొనసాగిస్తే,

  11. నేనే మీ పట్ల శత్రువుగా ఉంటాను, మీ పాపాలకు ఇంకా ఏడు రెట్లు బాధిస్తాను.

  12. నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.

  13. నేను మీ రొట్టె సరఫరాను నిలిపివేసినప్పుడు, పదిమంది స్త్రీలు మీ రొట్టెను ఒక పొయ్యిలో కాల్చగలుగుతారు, వారు తూనికె చొప్పున రొట్టెను కొలిచి ఇస్తారు. మీరు తింటారు, కానీ మీరు సంతృప్తి చెందరు.

  14. “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే,

  15. అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.

  16. నేను మీ క్షేత్రాలను నిర్మూలం చేస్తాను, మీ ధూప బలిపీఠాలను పడగొట్టి, మీ మృతదేహాలను ప్రాణం లేని మీ విగ్రహాల రూపాలపై పోగుచేస్తాను, నేను మిమ్మల్ని అసహ్యించుకుంటాను.

  17. నేను మీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను, మీ పరిశుద్ధాలయాలను వృథా చేస్తాను, మీ అర్పణల సువాసన యందు నేను ఆనందించను.

  18. నేను భూమిని వృధా చేస్తాను, తద్వార అక్కడ నివసించే మీ శత్రువులు ఆశ్చర్యపడతారు.

  19. నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.

  20. “ ‘మీలో మిగిలిన వారికైతే, వారి శత్రువుల దేశాల్లో గాలికి ఆకులు అల్లాడితే పారిపోవునంతగా వారి హృదయాలు ఎంతో భయపడేలా చేస్తాను. ఖడ్గం నుండి వారు పారిపోతున్నట్టు వారు పరుగెత్తుతారు, ఎవరు తరమకుండానే వారు పడిపోతారు,

  21. “ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,

  22. And that I also have walked contrary unto them, and have brought them into the land of their enemies; if then their uncircumcised hearts be humbled, and they then accept of the punishment of their iniquity:

  23. నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.

  24. భూమి వారిచే విడిచిపెట్టబడుతుంది, నిర్జనమవుతుంది, వారు లేకుండా, నిర్జన స్థితిలో ఉండగా, అది సబ్బాతు దినాలను ఆనందిస్తుంది. వారు నా చట్టాలను తిరస్కరించారు, నా శాసనాలను అసహ్యించుకున్నారు కాబట్టి వారు వారి పాపాలకు మూల్యం చెల్లిస్తారు.

  25. అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.