కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా మోషేతో అన్నారు,

  2. సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”

  3. యెహోవా మోషేతో అన్నారు,

  4. “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.

  5. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.

  6. ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను.

  7. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  8. “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.

  9. ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి, ఎనిమిదవ రోజు పరిశుద్ధ సభ నిర్వహించి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది ప్రత్యేక సభ ముగింపు; అప్పుడు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.

  10. “ ‘ఇవి యెహోవా నియమించబడిన పండుగలు, వీటిని యెహోవాకు హోమబలులు, దహనబలులు, భోజనార్పణలు, బలులు, పానార్పణలు తీసుకురావడానికి పరిశుద్ధ సభలుగా మీరు ప్రకటించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజు తీసుకురావాలి.

  11. ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.

  12. “ ‘ఏడవ నెల పదిహేనవ రోజు నుండి మీరు పొలం పంట కూర్చుకున్న తర్వాత యెహోవాకు ఏడు రోజుల పండుగ ఆచరించాలి; మొదటి రోజు సబ్బాతు విశ్రాంతి దినం, ఎనిమిదవ రోజు కూడా సబ్బాతు విశ్రాంతి దినము.

  13. మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.

  14. ప్రతి సంవత్సరం ఈ పండుగ యెహోవా కోసం ఏడు రోజులు మీరు ఆచరించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది; దీనిని ఏడవ నెలలో ఆచరించాలి.

  15. తద్వార ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని తాత్కాలిక ఆశ్రయాలలో నివసింపజేశానని మీ సంతతివారు తెలుసుకుంటారు. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

  16. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు.

  17. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  18. సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  19. యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.

  20. యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి.

  21. రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి.

  22. నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.

  23. అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”

  24. ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)

  25. యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.