కీర్తనలు 69:7-21
7
మీ కోసం నేను నిందల పాలయ్యాను, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది.
8
నా కుటుంబానికే నేను పరాయివాడిని అయ్యాను, నా సొంత తల్లి కుమారులకే నేను అపరిచితుని అయ్యాను;
9
మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక.
10
నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది.
11
నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు నన్ను హేళనకు సామెతగా చేశారు.
12
గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు.
13
అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి.
14
ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి.
15
వరదలు నన్ను ముంచనీయకండి, అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి గుంటలో నన్ను పడనివ్వకండి.
16
యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి.
17
మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి.
18
నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి; నా శత్రువుల నుండి నన్ను విడిపించండి.
19
నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, సిగ్గుపరిచారో మీకు తెలుసు; నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు.
20
వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు.
21
నా ఆహారంలో వారు చేదు కలిపారు దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.
Settings