Skip to content
ఆదికాండము 34:13-26

ఆదికాండము 34:13-26

13
వారి సోదరియైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది కాబట్టి యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రి హమోరుతో మోసపూరితంగా జవాబిచ్చారు.
14
వారు అన్నారు, “అలా మేము చేయలేము; సున్నతిలేని మనుష్యునికి మా సోదరిని ఇవ్వలేము. మాకది అవమానము.
15
ఒక షరతుతో మాత్రమే మీతో ఒప్పందం లోనికి వస్తాం; మీ మగవారందరు సున్నతి చేసుకుని మాలాగా మారాలి.
16
అప్పుడు మా కుమార్తెలను మీకు ఇస్తాము, మీ కుమార్తెలను మేము తీసుకుని మీతో నివసిస్తాం, మీతో ఒకే ప్రజలుగా అవుతాము.
17
మీరు సున్నతి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మా సోదరిని తీసుకుని వెళ్లిపోతాము.”
18
వారి ప్రతిపాదన హమోరుకు అతని కుమారుడైన షెకెముకు నచ్చింది.
19
ఆ యువకుడు, తన తండ్రి ఇంటి అంతటిలో ఘనత పొందినవాడు, యాకోబు కుమార్తె దీనాను ఎంతో కోరుకున్నాడు కాబట్టి వారు చెప్పింది చేయడానికి ఆలస్యం చేయలేదు.
20
కాబట్టి హమోరు అతని కుమారుడు షెకెము వారి పట్టణ నాయకులతో మాట్లాడడానికి పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లారు.
21
“ఈ మనుష్యులు మనతో స్నేహంగా ఉంటున్నారు” అని వారు అన్నారు. “వారిని మన దేశంలో నివసిస్తూ, వ్యాపారం చేయనిద్దాం; దేశంలో వారి కోసం చాల స్థలం ఉంది. మనం వారి కుమార్తెలను పెళ్ళి చేసుకుందాం, వారు మన వారిని చేసుకుంటారు.
22
అయితే వారు మనతో నివసిస్తూ, మనతో ఒకే ప్రజలుగా ఉండాలంటే మన మగవారందరు వారిలా సున్నతి చేసుకోవాలని ఒక షరతు పెట్టారు.
23
వారి పశువులు, వారి ఆస్తులు, వారి జంతువులన్నీ మనవి అవుతాయి కదా! కాబట్టి వారి షరతులు ఒప్పుకుందాము, వారు మన మధ్య స్థిరపడతారు.”
24
పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లిన మనుష్యులందరు హమోరు, అతని కుమారుడైన షెకెముతో ఏకీభవించారు, పట్టణంలో ప్రతి మగవాడు సున్నతి పొందాడు.
25
మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు.
26
వారు హమోరును, అతని కుమారుడైన షెకెమును ఖడ్గంతో చంపి, షెకెము ఇంటి నుండి దీనాను తీసుకెళ్లారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options