- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
దానియేలు సిద్ధపడుట మరియు దర్శన స్థలం
దానియేలు 10:1-4
దానియేలు సిద్ధపడుట మరియు దర్శన స్థలం
1
పర్షియా రాజైన కోరెషు పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో, దానియేలుకు (బెల్తెషాజరు అని పిలువబడేవాడు) ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత యొక్క సందేశం నిజం, అది మహా యుద్ధం గురించిన విషయము. అతనికి ఆ వార్త యొక్క గ్రహింపు దర్శనంలో వచ్చింది.
2
ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను.
3
నేను శ్రేష్ఠమైన ఆహారం తినలేదు; మాంసం కాని, ద్రాక్షరసం కాని నా పెదవులను తాకలేదు; మూడు వారాలు గడిచేవరకు సువాసనగల నూనె రాసుకోలేదు.
4
మొదటి నెల ఇరవై నాలుగవ రోజున నేను మహా నది టైగ్రీసు ఒడ్డున నిలబడి ఉన్నాను,
ఈ భాగాన్ని అధ్యయనం చేయండి
ఈ మొత్తం భాగంపై వ్యాఖ్యానం
- ఎవరు
- ఎక్కడ
- ఎప్పుడు
- About
లేఖనాల్లో ఇది ఇంకెక్కడ ఉందో
నెహెమ్యా 1:4
ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.వచనం 2 నుండిదానియేలు 1:21
దానియేలు రాజ్య సేవలో రాజైన కోరెషు పరిపాలనలోని మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు.వచనం 1 నుండిదానియేలు 6:28
కాబట్టి దానియేలు దర్యావేషు రాజు పరిపాలనలోను పర్షియా వాడైన కోరెషు రాజు పరిపాలనలోను వృద్ధి చెందాడు.వచనం 1 నుండిదానియేలు 8:26
“ఉదయ సాయంత్రాల గురించి నీకు ఇవ్వబడిన దర్శనం నిజమైనది, కాని దానిని రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే అది చాలా కాలం తర్వాత జరిగేది.”వచనం 1 నుండిదానియేలు 1:7
ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.వచనం 1 నుండిదానియేలు 9:24
“దోషం ముగించడానికి, పాపం తుదముట్టించడానికి, దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, శాశ్వత నీతిని చేకూర్చడానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, నీ పరిశుద్ధ పట్టణానికి డెబ్బై ‘ఏడులు’ నిర్ణయించబడ్డాయి.వచనం 2 నుండిదానియేలు 9:27
ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”వచనం 2 నుండిమత్తయి 6:17
అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి.వచనం 3 నుండిదానియేలు 1:17
ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.వచనం 1 నుండిఆదికాండము 2:14
మూడవ నది పేరు టైగ్రీసు, అది అష్షూరు ప్రాంతానికి తూర్పున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూఫ్రటీసు.వచనం 4 నుండి2 దినవృత్తాంతములు 36:22
పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:వచనం 1 నుండిదానియేలు 2:21
ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని ఇస్తారు.వచనం 1 నుండి

అధ్యయన గమనిక
Settings