Skip to content

Zelophehad గురించి బైబిల్ వచనాలు

29 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి

  2. సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి,

  3. “మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు.

  4. కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు.

  5. మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు,

  6. యెహోవా మోషేతో అన్నారు,

  7. సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి.

  8. “ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి.

  9. ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి.

  10. ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి.

  11. అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ”

  12. యోసేపు వంశం నుండి వచ్చిన మనష్షే కుమారుడు మాకీరు, గిలాదు వంశ పెద్దలు వచ్చి నాయకులు, ఇశ్రాయేలీయుల కుటుంబాల పెద్దలు ఎదుట మోషేతో మాట్లాడారు.

  13. “చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు భూమిని వారసత్వంగా ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించినప్పుడు మా సహోదరుడు సెలోఫెహాదు భూ వారసత్వాన్ని అతని కుమార్తెలకు ఇమ్మని ఆజ్ఞాపించారు.

  14. ఒకవేళ వారు ఇతర ఇశ్రాయేలు గోత్రం వారిని పెళ్ళి చేసుకుంటే, అప్పుడు వారి వారసత్వం పూర్వికుల గోత్రం నుండి మారి వేరే వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది. కాబట్టి వారి వారసత్వం లోని భాగం తీసివేయబడుతుంది.

  15. ఇశ్రాయేలు యొక్క మహోత్సవ సంవత్సరం వచ్చినప్పుడు, వారి వారసత్వం వారు పెళ్ళి చేసుకున్న వారి గోత్రంలో కలిసిపోతుంది, మా పూర్వికుల వంశ వారసత్వం నుండి స్వాస్థ్యం పోతుంది” అని అంటూ చెప్పారు.

  16. అప్పుడు యెహోవా ఆజ్ఞమేరకు మోషే ఇశ్రాయేలీయులను ఆదేశించాడు: “యోసేపు సంతతివారి గోత్రం వారు తెచ్చిన ఫిర్యాదు సరియైనదే.

  17. సెలోఫెహాదు కుమార్తెల గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: వారు తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్ళి చేసుకోవచ్చు, కానీ అది వారి తండ్రి గోత్ర వంశం వారై ఉండాలి.

  18. ఇశ్రాయేలు ప్రజల వారసత్వం ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రం లోకి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరూ తమ పూర్వికుల గోత్ర వారసత్వాన్ని తమ వంశం లోనే ఉంచుకోవాలి.

  19. ఇశ్రాయేలు ప్రజల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి కుమార్తె తన తండ్రి గోత్రం వారినే పెళ్ళి చేసుకోవాలి. ఈ విధంగా వారి వారి పూర్వికులు వారసత్వం వారి స్వాధీనంలోనే ఉంటుంది.

  20. వారసత్వం ఒక వంశం నుండి ఇంకొక వంశానికి వెళ్లకూడదు. ప్రతి ఇశ్రాయేలు గోత్రం వారు వారసత్వ భూమిని కాపాడుకోవాలి.”

  21. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం సెలోఫెహాదు కుమార్తెలు చేశారు.

  22. సెలోఫెహాదు కుమార్తెలైన మహ్లా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్ళి చేసుకున్నారు.

  23. వీరు యోసేపు కుమారుడైన మనష్షే సంతతివారిని పెళ్ళి చేసుకున్నారు వారి వారసత్వం వారి తండ్రి గోత్రం లోనే, వంశం లోనే నిలిచింది.

  24. ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.

  25. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారుడైన హెఫెరుకు పుట్టిన సెలోఫెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.