Woman గురించి బైబిల్ వచనాలు: Drawing and carrying water
Drawing and carrying water గురించి వచనాలు
పట్టణం బయట ఉన్న బావి దగ్గర ఒంటెలను మోకరింపజేశాడు; అది సాయంకాలం, స్త్రీలు నీళ్లు చేదుకోడానికి వచ్చే సమయము.
నేను ఈ నీటి ఊట దగ్గర నిలబడి ఉన్నాను, ఈ పట్టణవాసుల కుమార్తెలు నీళ్లు తోడుకోడానికి వస్తున్నారు.
అతడు ప్రార్థన ముగించకముందే రిబ్కా కడవ భుజంపై పెట్టుకుని వచ్చింది. ఆమె అబ్రాహాము సోదరుడు నాహోరు యొక్క భార్యయైన మిల్కా దంపతులకు పుట్టిన బెతూయేలు కుమార్తె.
రిబ్కా చాలా అందమైన కన్యక; ఏ మనుష్యుడు ఆమెతో శయనించలేదు. ఆమె బావిలోనికి దిగివెళ్లి తన కుండలో నీళ్లు నింపుకుని పైకి వచ్చింది.
వారు కొండ ఎక్కి ఆ పట్టణానికి వెళ్తుండగా, నీళ్లు తోడుకోడానికి వస్తున్న యువతులు ఎదురయ్యారు, అప్పుడు వారు, “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని వారిని అడిగారు.
ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.