కంటెంట్‌కు వెళ్లండి

Woman గురించి బైబిల్ వచనాలు: Celebrating the victories of the nation

5 వచనాలు · 73 కోణాలు

Celebrating the victories of the nation గురించి వచనాలు

  1. అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు.

  2. మిర్యాము వారితో ఇలా పాడింది: “యెహోవాకు పాడండి, ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”

  3. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.

  4. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు.

  5. ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ, “సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” అని పాడారు.