Woman గురించి బైబిల్ వచనాలు: Fond of dress and ornaments
Fond of dress and ornaments గురించి వచనాలు
కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”
ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,
చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,
తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,
ఉంగరాలు, ముక్కుపుడకలు,
పండుగ వస్త్రాలు, పైవస్త్రాలు, అంగీలు, సంచులు,
అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.