కంటెంట్‌కు వెళ్లండి

Unselfishness గురించి బైబిల్ వచనాలు

19 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ప్రేమలో ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి.

  2. బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము.

  3. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి.

  4. క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.

  5. నేను స్వతంత్రునిగా ఎవరికీ చెందినవాడిగా ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు ఎక్కువమందిని దేవుని కోసం సంపాదించడానికి నన్ను నేను అందరికి దాసునిగా చేసుకున్నాను.

  6. యూదులను సంపాదించడానికి యూదునిలా ధర్మశాస్త్రానికి లోబడిన వారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాన్ని కాకపోయినా ధర్మశాస్త్రానికి లోబడిన వానిలా అయ్యాను.

  7. ధర్మశాస్త్రం లేనివారిని సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం లేనివారిలో ఒక్కడిని అయ్యాను. దేవుని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందకపోయినా నేను క్రీస్తు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాను.

  8. బలహీనులను సంపాదించడానికి బలహీనులకు బలహీనుడనయ్యాను. అన్ని విధాలుగా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధాలుగా ఉన్నాను.

  9. సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటిని చేశాను.

  10. ఎవరైనా సరే తమ మంచినే చూసుకోకూడదు ఇతరుల మంచిని కూడా చూడాలి.

  11. అలాగే నేను కూడా అందరిని అన్ని విధాలుగా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నా స్వలాభాన్ని ఆశించకుండా, అనేకమంది రక్షింపబడాలని వారి మంచి కోరుతున్నాను.

  12. ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.

  13. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.

  14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కోసం ఒక్కడే మరణించాడు కాబట్టి అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాము.

  15. ఆయన అందరి కోసం చనిపోయారు, కాబట్టి జీవిస్తున్నవారు ఇకపై తమ కోసం కాక, వారి కోసం మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.

  16. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.

  17. స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ,

  18. మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.

  19. “మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే.