Skip to content

Towers గురించి బైబిల్ వచనాలు

40 వచనాలు · 33 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.

  2. గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి.

  3. కోట విడిచిపెట్టబడుతుంది కోలాహలంగా ఉన్న పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది; కోట, కావలికోట శాశ్వతంగా బంజరు భూమిలా మారుతాయి, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా, మందలకు పచ్చికబయళ్లుగా ఉంటాయి,

  4. “నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, మీరు వారి మార్గాలను గమనిస్తారని వాటిని పరీక్షిస్తారని.

  5. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి.

  6. వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను.

  7. అర్వాదు వారు, హెలెకు వారు అన్నివైపులా నీ గోడలకు కాపలా కాసారు; గమ్మాదీయులు నీ గోపురాలలో ఉన్నారు. వారు తమ డాళ్లు, శిరస్త్రాణాలు నీ గోడలకు వ్రేలాడదీశారు; వారు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.

  8. నేను నీకు నీ నదికి విరోధిని అయ్యాను. ఈజిప్టు దేశాన్ని మిగ్దోలు నుండి సైనే వరకు కూషు సరిహద్దు వరకు పూర్తిగా పాడుచేసి ఎడారిగా చేస్తాను.

  9. “ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, దాని బల గర్వం అణిగిపోతుంది. మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. మందకు కావలికోటగా, సీయోను కుమార్తె దుర్గంగా ఉన్న నీకైతే, మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.”

  11. నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని నగర గోడపై నిలబడి ఉంటాను; ఆయన నాతో ఏమి చెప్తాడో, ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.

  12. “నేను దేశాలను నాశనం చేశాను; వాటి కోటలు పడగొట్టబడ్డాయి. నేను వాటి వీధులను ఎడారిగా వదిలేశాను, ఎవరూ వాటి గుండా వెళ్లరు. వాటిలో ఎవరూ నివసించకుండా వారి పట్టణాలను నిర్జనంగా చేశాను.

  13. యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది.

  14. “మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.

  15. సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా?