కంటెంట్‌కు వెళ్లండి

The Power of God గురించి బైబిల్ వచనాలు

89 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బలం లేనివానిగా ఆయన సిలువ వేయబడ్డారు కాని, దేవుని శక్తినిబట్టి ఆయన జీవిస్తున్నారు. అలాగే మేము ఆయనలో బలహీనులం, అయినా మేము మీతో వ్యవహరించే విషయంలో దేవుని శక్తినిబట్టి ఆయనతో కూడ జీవిస్తున్నాము.

  2. ఎందుకంటే, సున్నతి పొందే యూదుల కోసం అపొస్తలునిగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం ఇచ్చిన దేవుడే సున్నతిలేని యూదేతరుల కోసం అపొస్తలునిగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం ఇచ్చారు.

  3. And what is the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power,

  4. దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.

  5. మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,

  6. చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.

  7. మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.

  8. ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు.

  9. కాబట్టి నీవు మన ప్రభువు కోసం సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కోసం బందీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తినిబట్టి సువార్త కోసం నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.

  10. చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.

  11. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, యుగయుగములకు పూర్వం, ఇప్పుడు, ఎల్లప్పుడు మహిమ ఘనత ఆధిపత్యం అధికారం కలుగును గాక! ఆమేన్.

  12. “ఓ ప్రభువా, మా దేవా! నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్త ప్రకారమే అవి సృష్టించబడ్డాయి, కాబట్టి మహిమ, ఘనత, ప్రభావాలు పొందడానికి నీవే యోగ్యుడవు.”

  13. అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: “సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,

  14. “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడవైన సర్వశక్తిగల ప్రభువైన దేవా, నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు, కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.