The Mule గురించి బైబిల్ వచనాలు: Riding, by persons of distinction
Riding, by persons of distinction గురించి వచనాలు
అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు.
రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.