Skip to content

Obadiah

6 వచనాలు

Obadiah ను ప్రస్తావించే వచనాలు

  1. కాబట్టి అహాబు తన రాజభవన నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించాడు. (ఓబద్యా యెహోవా పట్ల భయభక్తులు గలవాడు.

  2. యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపిస్తూ ఉన్నప్పుడు, ఓబద్యా వందమంది ప్రవక్తలను తీసుకెళ్లి వారిని దాచిపెట్టి, వారిని యాభైమంది చొప్పున రెండు గుహల్లో ఉంచి వారికి అన్నపానాలు అందించాడు.)

  3. అహాబు ఓబద్యాతో, “దేశంలో తిరిగి పర్యటిస్తూ అన్ని ఊటలను, వాగులను చూడు. మన గుర్రాలు, కంచరగాడిదలు చావకుండ వాటికి గడ్డి దొరుకుతుందేమో అప్పుడు కొన్ని పశువులనైనా చావకుండ చూడగలం” అన్నాడు.

  4. కాబట్టి వారు దేశమంతా తిరిగి చూడడానికి వీలుగా ఒకవైపు అహాబు, మరోవైపు ఓబద్యా వెళ్లారు.

  5. ఓబద్యా దారిన వెళ్తుండగా ఏలీయా అతనికి ఎదురయ్యాడు. ఓబద్యా అతన్ని గుర్తుపట్టి సాష్టాంగపడి, “నా ప్రభువా ఏలీయా, నిజంగా మీరేనా?” అన్నాడు.

  6. ఓబద్యా అహాబును కలుసుకోడానికి వెళ్లి ఈ విషయం తెలియజేయగా అహాబు ఏలీయాను కలుసుకోడానికి వెళ్లాడు.