The Feast of the Passover గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు దాని పంటను కోయండి, మీరు పండించిన మొదటి ధాన్యం యొక్క పనను యాజకుని దగ్గరకు తీసుకుని రండి.
అతడు యెహోవా ఎదుట ఆ పనను పైకెత్తి దానిని అర్పించాలి తద్వార అది మీ పక్షంగా అంగీకరించబడుతుంది; దానిని యాజకుడు సబ్బాతు తర్వాత రోజున పైకెత్తి ఆడించాలి.
పనను పైకెత్తి అర్పించిన రోజు, లోపం లేని ఒక ఏడాది గొర్రెపిల్లను యెహోవాకు దహనబలిగా అర్పించాలి,
దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.
మీరు ఈ అర్పణను మీ దేవునికి తీసుకువచ్చే రోజు వరకు ఏ రొట్టె గాని, కాల్చిన ధాన్యం గాని లేదా క్రొత్త ధాన్యం గాని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
దాని నిర్ణీత సమయంలో అనగా, ఈ నెల పద్నాలుగవ రోజు సాయంకాల సమయంలో, నియమ నిబంధనలతో ఈ పండుగ జరుపుకోవాలి.”
కాబట్టి మోషే పస్కాను జరుపుకోమని ఇశ్రాయేలీయులకు చెప్పాడు,
వారంతా అదే విధంగా మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంకాలం సీనాయి అరణ్యంలో పస్కాను జరుపుకుంటారు. ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశారు.
అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి,
వారు మోషేతో, “ఒక మనుష్యుని మృతదేహాన్ని బట్టి మేము అపవిత్రులం అయ్యాము, అయితే యెహోవా అర్పణను ఇతర ఇశ్రాయేలీయులతో పాటు నిర్ణీత సమయంలో మేము ఎందుకు సమర్పించకూడదు?” అని అడిగారు.
అందుకు మోషే వారితో, “మీ గురించి యెహోవా ఏమి ఆజ్ఞాపిస్తారో తెలుసుకునే వరకు ఆగండి” అని జవాబిచ్చాడు.
అప్పుడు యెహోవా మోషేతో,
“ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు,
అయితే వారు రెండవ నెల పద్నాలుగవ రోజు సాయంకాలం జరుపుకోవాలి. వారు పులియని రొట్టెలతో, చేదు కూరలతో పాటు గొర్రెపిల్లను తినాలి.
యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు;
ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.
మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి.
ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.
ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి.
రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు.
దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు.
ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది.
ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!
పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.”