కంటెంట్‌కు వెళ్లండి

Strangers in Israel గురించి బైబిల్ వచనాలు

65 వచనాలు · 33 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.

  2. ఈ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులు వారి మధ్య నివసించే విదేశీయులకు ఆశ్రయపురాలుగా ఉంటాయి, తద్వార, ప్రమాదవశాత్తు ఒకరు ఎవరినైన చంపితే, వాటికి పారిపోయి ఆశ్రయం పొందవచ్చు.

  3. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, “మీ ప్రజలమధ్య ఉన్న వివాదాలు విని, ఇద్దరు ఇశ్రాయేలీయుల మధ్య అయినా లేదా ఒక ఇశ్రాయేలీయునికి ఒక విదేశీయునికి మధ్య అయినాసరే, న్యాయంగానే తీర్పు తీర్చాలి.

  4. కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు.

  5. తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.

  6. మీరు కూడ ఈజిప్టులో విదేశీయులుగా ఉన్నారు కాబట్టి మీరు విదేశీయులను ప్రేమించాలి.

  7. మీరు ముందే కనుగొన్న చచ్చినదానిని తినకూడదు. మీ పట్టణాల్లో నివసించే విదేశీయులకు మీరు దానిని ఇవ్వవచ్చు, వారు దానిని తినవచ్చు లేదా ఇతర విదేశీయులకు దానిని అమ్మవచ్చు. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

  8. And the Levite, (because he hath no part nor inheritance with thee,) and the stranger, and the fatherless, and the widow, which are within thy gates, shall come, and shall eat and be satisfied; that the LORD thy God may bless thee in all the work of thine hand which thou doest.

  9. మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి.

  10. మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి.

  11. మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు.

  12. మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్లినప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారిని మీ చేతులకు అప్పగించి, మీరు బందీలను తెచ్చినప్పుడు,

  13. మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  14. న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి,

  15. మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  16. మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.

  17. మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  18. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  19. నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.

  20. మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు.

  21. ఇశ్రాయేలీయుల సమక్షంలో, యెహోషువ మోషే ధర్మశాస్త్ర ప్రతిని రాళ్లపై వ్రాశాడు.

  22. ఇశ్రాయేలీయులందరు, వారి పెద్దలు, అధికారులు, న్యాయాధిపతులతో పాటు యెహోవా నిబంధన మందసానికి ఇరువైపులా, దానిని మోస్తున్న లేవీయ యాజకులకు ఎదురుగా నిలబడ్డారు. వారి మధ్య నివసిస్తున్న విదేశీయులు, స్థానికంగా పుట్టినవారు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవా సేవకుడైన మోషే గతంలో సూచనలు ఇచ్చినప్పుడు ఆజ్ఞాపించినట్లుగా వారిలో సగం మంది ప్రజలు గెరిజీము పర్వతం ముందు, సగం మంది ఏబాలు పర్వతం ముందు నిలబడ్డారు.

  23. ఆ తర్వాత, యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని అనగా దీవెనలను శాపాలను ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినట్లే చదివాడు.

  24. స్త్రీలు, పిల్లలు, వారి మధ్య నివసించే విదేశీయులతో సహా ఇశ్రాయేలీయుల సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించిన వాటిలో యెహోషువ చదవకుండా ఒక్క మాట కూడా విడిచిపెట్టలేదు.

  25. సొలొమోను రాజు తూరు నుండి హూరాము అనే అతన్ని పిలిపించాడు.