Skip to content

Skepticism గురించి బైబిల్ వచనాలు

11 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అందుకు ఫరో, “నేను ఆయన మాట విని ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వడానికి యెహోవా ఎవరు? ఆ యెహోవా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను నేను పంపను” అన్నాడు.

  2. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  3. దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!

  4. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. “దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.

  5. సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.

  6. ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను.

  7. “మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి?

  8. కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం” అని చెప్పారు. అప్పుడు అతడు వారితో, “నేను ఆయన చేతిలో మేకులు కొట్టిన గాయాలలో నా వ్రేలును ఆయనను పొడిచిన ప్రక్కలో నాచేయి పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను” అన్నాడు.

  9. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు.

  10. తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు.

  11. తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.