Thomas
ఇలా కూడా పిలుస్తారు: Didymus
Thomas ను ప్రస్తావించే వచనాలు
ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, పన్ను వసూలు చేసే మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి;
అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, అత్యాసక్తి కలవాడైన సీమోను,
మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అని పిలువబడే సీమోను,
అప్పుడు దిదుమ అని పిలువబడే తోమా, “ఆయనతో పాటు చనిపోవడానికి ‘మనం కూడ వెళ్దాం రండి’ ” అని తోటి శిష్యులతో అన్నాడు.
తోమా ఆయనతో, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకు ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
పన్నెండుమంది శిష్యులలో దిదుమా అని పిలువబడే తోమా, యేసు వచ్చినప్పుడు అక్కడ వారితో లేడు.
ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు మరల ఇంట్లో ఉన్నప్పుడు తోమా వారితో పాటు ఉన్నాడు. వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి, అయినా యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో చెప్పారు.
తర్వాత ఆయన తోమాతో, “నా చేతులను చూడు; నీ వ్రేలితో ఆ గాయాలను ముట్టి చూడు. నీ చేయి చాపి నా ప్రక్క గాయాన్ని ముట్టి చూడు. అనుమానించడం మాని నమ్ము” అన్నారు.
తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.
అప్పుడు యేసు అతనితో, “నీవు నన్ను చూసి నమ్మినావు; చూడకుండానే నమ్మినవారు ధన్యులు” అన్నారు.
సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్నప్పుడు,
వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా; బర్తలోమయి, మత్తయి; అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే సీమోను, యాకోబు కుమారుడైన యూదా.